Saturday, December 21, 2024

ఎమ్మెల్యే పదవి ఆశామాషి కాదు

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: నర్సంపేటకు ఎమ్మెల్యేగా కావాలనుకోవడం ఆశామాషి కాదు. దానికంటూ ఓ స్థాయి ఉండాలని.. ఎవరు పడితే వారు ఎమ్మెల్యే అవుతామనుకోవడం సమంజసం కాదని వరంగల్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న అన్నారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో పోడు రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవి గురించి చాలా సింపుల్ గా మాట్లాడుకుంటున్నారని.. ఎమ్మెల్యేగా పెద్ది సుదర్శన్‌రెడ్డి 30 ఏళ్లు కష్టపడితే ఆ పదవిలో ఉన్నారని.. ఏదో రాజకీయాల్లో ఇలా వచ్చి అలా ఎమ్మెల్యే కావాలనుకోవడం దురాష అన్నారు. నర్సంపేట ప్రజలు ఎంతో చైతన్యవంతులని అలాంటి ఈ ప్రాంతంలో ప్రజలు ఎవరికి పడితే వారికి పట్టం కట్టరన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఓ విజన్ ఉన్న నాయకుడని ఆయనకు తగ్గట్టుగా మరెవరూ కనుచూపు మేరన కూడా లేరని ఆమె పేర్కొన్నారు.

పోడు రైతులకు పట్టాల కోసం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎంతో కష్టపడ్డారన్నారు. ఆయన ఆసుపత్రిలో ఐసీయూలో ఉండి కూడా మంగళవారిపేటలో అధికారులు పోడు సర్వే చేస్తున్నారని తెలియడంతో అక్కడికి వెళ్లాలని తనను ఆదేశించాడని ఇందుకు తాను మీరు ఆసు పత్రిలో చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు.. నేను లేకుంటే ఎలా అని అనడంతో నాకేం కాదు.. ముందు మం గళ వారి పేటకు వెళ్లు అని గట్టిగా చెప్పడంతో నేను ఆ రోజు మంగళవారిపేటకు వెళ్లి పోడు భూముల సర్వే చేయించానన్నారు. నాటి సంఘటనను నిండు సభలో గుర్తు చేయడంతో ప్రతీ ఒక్కరు హర్షద్వానాల మధ్య మద్దతు పలికారు. ఎంపీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్‌లు ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్నను ఈ సందర్భంగా అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News