Saturday, November 23, 2024

శంషీర్‌గంజ్ న్యూరోడ్డులో తెగిపడిన విద్యుత్ తీగ

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట: పాతబస్తీ అలియాబాద్ శంషీర్‌గంజ్ నుంచి గోశాలకు వెళ్ళే ప్రధాన రహదారి వెంట గల పాదచారుల బాటపై ఆదివారం సాయంత్రం విద్యుత్ తీగ ఉన్నఫళంగా తెగిపడింది. దీంతో అక్కడే కూరగాయలు విక్రయిస్తున్న తోపుడు బండి వ్యాపారి తృటిలో విద్యుదాఘాతం నుండి తప్పించుకున్నాడు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వీచిన ఈదురు గాలులు, వర్షానికి జలమండలి ప్రహరీ మార్గంలో ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలు విరిగి కరెంటు తీగలపై పడ్డాయి. దీంతో కరెంటు తీగ తెగిపడింది. అప్రమత్తమైన మజ్లిస్ నేత మహ్మద్ మేరాజ్ వెంటనే టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ ఖాజా పహాడి అధికారులకు సమాచారం అందించాడు.

కరెంటు సిబ్బంది అక్కడికి చేరుకొని తెగిపడిన విద్యుత్ తీగను పరీక్షించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి చెట్ల కొమ్మలను తొలగించారు. తెగిపడిన విద్యుత్ తీగను సవరించి సరఫరాను పునఃరుద్దరించారు. కాగా ప్రధాన రోడ్డుకు ఇరువైపుల భారీ వృక్షాలు, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి విద్యుత్ తీగలు, కేబుల్ వైర్లు, ఇంటర్నెట్ వైర్లు కలిసి గిజిబిజిగా మారాయని, తరచు కరెంటు సరఫరాకు, వీధి దీపాలకు అంతరాయం కలిగిస్తున్నాయని, కొమ్మలను తొలగించాలని మజ్లిస్ నేత మహ్మద్ మేరాజ్ గత కొన్ని నెలలుగా టీఎస్‌ఎస్‌పీడీసీఎల్, జీహెచ్‌ఎంసి అధికారులకు విన్న విస్తున్నారు.

అయితే సమస్యను ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ జఠిలంగా మారుస్తున్నారని, వారి నిర్లక్షం వల్లే చెట్టుకొమ్మ విద్యుత్ తీగపై పడి కరెంటు తీగ తెగిపడినట్లు మేరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇప్పటికైన విద్యుత్ అధికారులు స్పందించి కరెంటు తీగలకు అడ్డంగా ఉన్న చెట్లకొమ్మలను తొలగించాలని కోరారు. లేని పక్షంలో వర్షాకాలంలో వీచే ఈదురు గాలులు, వర్షానికి తరచు కరెంటు సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని విన్నవించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News