Saturday, December 28, 2024

గొంతులో ప్రాణం ఉన్నంత వరకు సేవా చేస్తా : మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్ : పదవి ఉన్నా లేకున్నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జవహర్‌నగర్‌కు సేవా చేస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం కార్పొరేషన్ పరిధిలోని 1,2,3,6,7,8,18,21,26 డివిజన్లలో దాదాపు 8 కోట్ల 10 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ పనులకు మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకనాడు మురికివాడగా ఉన్న జవహర్‌నగర్ తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ సహకారంతో దాదాపు రూ.130 కోట్లతో అభివృద్ధి చేసి మంచి పట్టణంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.

మేడ్చల్ నియోజకవర్గంలోనే జవహర్‌నగర్ కార్పొరేషన్‌ను మోడల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతానని అన్నారు. రానున్న రోజుల్లో ప్రతి బస్తీ అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేస్తానన్నారు. లేబర్ డిపార్ట్‌మెంట్ సహకారంతో 350 మంది భవన నిర్మాణ మహిళా కార్మికులకు ఉచితంగా కుట్టుమిషన్లు అందించనున్నట్లు తెలిపారు.
8వ డివిజన్‌కు అధిక నిధులు కేటాయించండి : డిప్యూటీ మేయర్
కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ పూర్తిగా లోతట్టు ప్రాంతమని వర్షాకాలంలో డివిజన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 15 డివిజన్ల నుంచి వర్షపు నీరు, మురికి నీరు ఈ డివిజన్‌లోనే ప్రవహిస్తుందని, మంత్రి ప్రత్యేక దృష్టి సారించి అధిక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై మంత్రి మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి తప్పకుండా అధిక నిధులు కేటాయిస్తానని సభాముఖంగా హామి ఇచ్చారు. బిఆర్‌ఎస్ నాయకులు కొమ్మురాజుల వెంకటేష్ మంత్రి మల్లారెడ్డి, మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌ను ఘనంగా సన్మానించారు.

అంతకుముందు డివిజన్‌లో మహిళలు బోనాలతో మంత్రికి స్వాగతం పలికారు. డివిజన్ కార్పొరేటర్లు మంత్రికి ఘన స్వాగతం పలికి సన్మానించి, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ రామలింగం, కార్పొరేటర్లు రాజ్‌కుమార్, శివాజి,నాగరాణిగౌడ్, పల్లపు రవి, మెట్టు ఆశాకుమారి, దొంతగాని శాంతికోటేష్‌గౌడ్, ప్రేమల శ్రీనివాస్, పానుగంటి బాబు, కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ నూరుద్ధీన్ పారుఖ్, శోభారెడ్డి, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News