Monday, December 23, 2024

కుల వృత్తుల ఉనికిని కాపాడుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

    పటాన్ చెరు: సంప్రదాయాలకు చిహ్నంగా ఉండే కులవృత్తులను మరిచి పోవద్దని రానున్న రోజుల్లో కుల వృత్తులకు మంచి బహుష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెప్పారు. మండల పరిధిలోని పాశమైలారంలో ఆదివారం కుమ్మర కులస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మెల సభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉనికిని కోల్పోత్తున్న కుల వృత్తులకు జీవం పోసింది సిఎం కెసిఆర్ అన్నారు. బిసిల స ంక్షేమం కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన గణత మన సిఎంకే దక్కుతుందన్నారు. ప్రభుత్వం కల్సించే అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.కుల వృత్తుల సంక్షేమం కోసం తాను ఎప్పుడు పోరాడుతూనే ఉంటానన్నారు. వచ్చే నెలలో 500 గజాల స్థలంలో కుమ్మర కులస్తుల కోసం ఫంక్షన్ హాలు నిర్మాణం చేపట్టనున్నట్టుగా తెలిపారు.అన్ని వ ర్గాల సంక్షేమమే కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వ లక్షమన్నారు. గ్రామ సర్పంచ్ కృష్ణ యా దవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మణ్ విజయ్ కుమార్,నాయకులు వెంకట్ రెడ్డి,సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News