లక్ష్మిదేవిపల్లి : సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్‌లోని భద్రాచలం సెక్షన్‌లో ఏడవ తేదీన జరగనున్న రైల్వే ఇనిస్టూట్ ఎన్నికల్లో భాగంగా మజ్దుర్ యూనియన్ రైల్వే ఉద్యోగులు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం రైల్వే రన్నింగ్ స్టాప్ వరకు నాయకులు ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గడిచిన మూడు దఫాలలో మజ్దూర్ యూనియన్ ప్యానెల్ విజయ్‌కేతనం ఎగరవేసిందని, గతంలో యూనియన్ ప్యానెల్ గెలిచిన తర్వాత ఇనిస్టూట్ సభ్యులకు, వారి కుటుంబీలకు, పిల్లలకు, అనేక రకాల ఆటలు, పాటలు, పోటీలను కుట్లు, అల్లికలు, వంటివి నేర్చుకోవడానికి వారిని ప్రోత్సహించారని తెలిపారు. భద్రాచలం రోడ్ ఇనిస్టూట్ పేరు ప్రఖ్యాతలను నేషనల్ , జోనల్ స్థాయిలో నిలిచి, రైల్వే ఉన్నత అధికారులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
అనునిత్యం కార్మిక సమస్యలను పరిష్కరించడంలో ఎస్‌సిఆర్‌ఎంయు ఎంతో కృషి చేస్తూ, యూనియన్‌ను ముందుకు తీసుకు పోవడంలో నాటి సెక్రటరీ, నేటి డివిజనల్ ప్రెసిడెంట్ ఎస్‌కె. ఖాజా బాబా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించడంలో కృషి చేశాడని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను మజ్దూర్ యూనియన్ ముందంజలో ఉందని కావున ఇనిస్టిట్యూట్ ఎన్నికల్లో యూనియన్ ప్యానల్‌పై మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ సెక్రటరీ బసవరి పుల్లయ్య, చైర్మన్ వైజీరావు, ఓం కుమార్, ఆఫీస్ బేరర్లు రామారావు, నాగరాజు, పవన్, రవితేజ, క్రాంతి, రవిరాజు, ఉదయ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.