Saturday, November 23, 2024

బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి

- Advertisement -
- Advertisement -
  • సాయి సంజీవని ఆసుపత్రి వైద్యుల నిర్లక్షం
  • సాయి సంజీవని ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన

నారాయణఖేడ్: వైద్య వృత్తి అనేది దేవుడు ఇచ్చిన వరం.. వైద్యులు దేవుళ్లతో సమానంగా ప్రజలు భావిస్తుంటారు. కానీ వైద్య వృత్తిని వ్యాపారంగా మార్చుకొని అధిక డబ్బులకు ఆశపడి వైద్యసేవల్లో నిర్లక్షంగా వ్యవహరించడంతో ఓ బాలింత మృతిచెందిన సంఘటన ఖేడ్‌లో చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం ఖేడ్ నియోజవవర్గంలోని సిర్గాపూర్ మండలంలోని సింగార్‌బొగుడతండాకు చెందిన భూలిబాయి (25) ప్రసవం కోసం సాయి సంజీవని ఆసుపత్రికి వచ్చిందన్నారు. కాగా గత రెండు ప్రసవాలు సాధారణంగా కాగా మూడో ప్రసవం కోసం సాయి సంజీవని ఆసుపత్రిలో సీజరింగ్ చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది.

దీంతో భూలిబాయికి అధిక రక్తస్రావం కాగా హుటిహుటీగా ఆసుపత్రి సిబ్బంది ఎవరికి తెలియకుండా హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందగా విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ సాయి సంజీవని ఆసుపత్రిలో ఇలాంటివి ఆరు సంఘటనలు చోటుచేసుకున్నట్లు పలువురు ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు జరిగిన ఇప్పటి వరకు ఆసుపత్రిపై చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రజలు ఆరోపిస్తున్నారు. పోయిన ప్రాణానికి ఖరీదు కడుతూ అధికారులను మాముళ్ల మత్తులో ముంచెస్తూ ఇలాంటి సంఘటనలు బయటకు రాకుండా చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికీ జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఇలాంటి సంఘటనలు చోటు చే సుకుంటున్నాయని పలువురు ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News