పదర : కంప్రెసర్ ట్రాక్టర్ టైరు పగిలి అగ్ని ప్రమాదం జరగడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అచ్చంపేట మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన వరికుప్పల బాబు తన అల్లుడు పుల్లయ్యతో కలిసి పదర గ్రామానికి డ్రిల్లింగ్ చేయడానికి వస్తుండగా మద్దిమడుగు ప్రధాన రహదారి రాయలగండి సమీపంలోని నక్కల గుట్ట వద్దకు రాగానే కంప్రెసర్ ట్రాక్టర్ టైరు పగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ట్రాక్టర్ డిజిల్ ట్యాంకర్ పగలడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని ట్రాక్టర్ రెండుగా విడిపోయిందని తెలిపారు. ప్రమాదంలో హాజీపూర్ గ్రామానికి చెందిన వరి కుప్పల బాబు (40) సంఘటన స్థలంలోనే అక్కడికక్కడే పూర్తిగా కాలిపోయి మృతి చెందారని తెలిపారు. మరొక వ్యక్తి డేరంగుల పుల్లయ్యకు తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రున్ని హుటాహుటిన 108 అంబులెన్స్ ద్వారా అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారని అన్నారు. ట్రాక్టర్‌లో భారీ మంటలు శబ్దం రావడంతో చుట్టు పక్కల వ్యవసాయదారులు ఒక్కసారిగా ఉలికిపడి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.
కంప్రెసర్ ట్రాక్టర్‌లో మంటలు చెలరేగి వ్యక్తి మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -