Sunday, November 24, 2024

కులవృత్తుల అభివృద్ధి ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: కుల వృత్తుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్‌కుమార్ అన్నారు. ప్రభుత్వ సంస్థల దోబీ సేవలను ఇక నుంచి రజక సొసైటీలకే కేటాయించాలని ప్రభుత్వం జిఓ 102ను జారీ చేయగా ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిఎం కెసిఆర్, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ల చిత్ర పటాలకు రజ క సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కుల వృ త్తుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు. గురుకుల పాఠశాలల ఏర్పాటు ద్వారా మధ్య తరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు. రజకుల కుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నా రు.

రజకులు బట్టలు ఉతికేందుకు దోబీఘాట్‌లు నిర్మించడంతో పాటు ఇస్త్రీ దుకాణాలు నిర్వహించుకునేందుకు ప్రతి నెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. ఇళ్లు లేని నిరుపేదల ఆత్మగౌరవం కోసం అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. త్వరలోనే డబుల ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు.

ప్రభుత్వ సంస్థల్లో రజకులే దోబీ సేవలు అందించేలా జిఓ జారీ చేయడం పట్ల సిఎం కెసిఆర్‌కు ఎమ్మెల్యే సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News