Saturday, November 23, 2024

సివిల్‌కోడ్‌పై నేడు పార్లమెంటరీ కమిటీ సమీక్ష

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : యూనిఫాం సివిల్ కోడ్ నేపథ్యంలో దేశంలోని వ్యక్తిగత చట్టాల ఉమ్మడి పౌరస్మృతిపై సమీక్ష సంబంధిత చర్చకు న్యాయ చట్ట మంత్రిత్వశాఖకు చెందిన పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులు సోమవారం సమావేశం అవుతారు. అయితే వీరికి ఇప్పటివరకూ సమీక్ష సంబంధిత పూర్తి వివరాల పత్రాలు అందలేదు. కేవలం కుటుంబ చట్టాల సంస్కరణల సంబంధిత 21వ లా కమిషన్ సంప్రదింపుల పత్రం అందింది. దీనిని కాంగ్రెస్ వర్గాలు ప్రధానంగా ప్రస్తావించాయి.

లా కమిషన్ ఇప్పటికీ పార్లమెంటరీ కమిటీకి సివిల్‌కోడ్‌పై వివరణలు అందించలేదని, ఈ దశలో దీనిపై చర్చ కానీ తరువాతి నిర్ణయాలు కానీ అసమంజనం అవుతాయని , ముందు సివిల్ కోడ్‌పై లా కమిషన్, కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ అభిప్రాయాలు అందాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికైతే సంబంధిత బిల్లుపై లా కమిషన్ నుంచి కానీ న్యాయమంత్రిత్వశాఖ నుంచి కానీ ఎటువంటి నివేదిక లేనందున సివిల్‌కోడ్‌పై స్పందించేందుకు ఏమీ లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News