Tuesday, December 24, 2024

సంక్షోభంలోనే సాగు సత్తా చూపిద్దాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని, గోదావరి, కృష్ణా నదుల పరిధిలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ఈ దిశగా ఇరిగేషన్ శాఖ, విద్యు త్ శాఖ సమన్వయంతో పనిచేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఎత్తిపోతలకు సరిపోయే విద్యుత్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఇరిగేషన్ శాఖ, వి ద్యుత్ శాఖ సమన్వయం చేసుకోవాలని సి ఎం ఆదేశించారు. కష్టకాలంలో నీటిని వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రజలు, రైతాం గం జాగ్రత్త వహించాలని, నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని అందుకు వ్యవసాయ ఇరిగేషన్ శాఖ ఇంజినీర్ల సూచన లు, సలహాలు పాటిస్తూ పంటలు పండించుకోవాలని రైతులకు సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్ర రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కాపాడుకోవడమే ప్ర ధాన లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామని సిఎం పునరుద్ఘాటించారు.

చుక్క ఒడిసిపట్టి, ప్రజలకు నీటిని అందించాలని సిఎం అధికారులకు సూచించారు. రాష్ట్రం లో వర్షపాతం, ప్రాణహిత తదితర నదుల్లో ప్రవహిస్తున్న నీటి లభ్యత, రాష్ట్రంలోని రిజర్వాయర్లలోని నీటి నిల్వలు, ప్రస్తుతం కొనసాగుతు న్న విద్యుత్ డిమాండ్ తదితర పరిస్థితులపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి కె. చం ద్రశేఖర్‌రావు డా. బి.ఆర్.అంబేద్కర్ రా ష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రా జెక్టులోని నీటి లభ్యతా వివరాలను సిఎం కె సిఆర్‌కు ఆయా శాఖల ఉన్నతాధికారులు వివరించారు. కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుందని, తరువాయి 12లో
ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతగా కష్టపడ్డారో అదే స్థాయిలో ప్రాణహిత, గోదావరి ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్టు ఎత్తిపోస్తూ రాష్ట్రంలో త్రాగునీటికి,

సాగునీటికి ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారుల మీద ఉందని కెసిఆర్ పేర్కొన్నారు. ఇన్ని రోజులు ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు అని, ఇది ఇరిగేషన్ శాఖకు పరీక్ష వంటిదని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఇది మునుపటి తెలంగాణ కాదు. గతంలో మాదిరిగా ఆలోచిస్తే కుదరదని కెసిఆర్ పేర్కొన్నారు. నీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నామని, తాగు, సాగునీటి అవసరాలకు సమృద్ధిగా నీరు అందుతుందన్నారు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కెసిఆర్ పేర్కొన్నారు.
సంక్షోభ సమయంలోనే మనం పంటలు పండించాలి
సంక్షోభ సమయంలోనే మనం పంటలు పండించి చూపించాలని, అప్పుడే మనం సిపాయిలమని కెసిఆర్ తెలిపారు. అన్ని వ్యవస్థలు సమన్వయం చేసుకుంటూ, ఎవరి పని వారు సమర్థవంతంగా నిర్వహిస్తూ, మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని కెసిఆర్ సూచించారు. మీ పరిజ్ఞానాన్ని అంతా పెట్టి ప్రజల కోసం పనిచేయాలన్నారు. ఈ పరిస్థితిని సవాల్‌గా తీసుకోవాలని, ఈ ఒక్క సంవత్సరం అనుభవం భవిష్యత్ తెలంగాణ చరిత్రలో ఉపయోగపడుతుందని కెసిఆర్ పేర్కొన్నారు. ఎక్కడి ఈఎన్సీలు అక్కడే ఉండి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు నీరు అందించడమే లక్ష్యంగా నిరంతరం ఏకాగ్రతతో పనిచేయాలని, ఇందుకు అందరం కలిసి ప్రతిజ్ఞ తీసుకోవాలని సిఎం స్పష్టం చేశారు.
ఉదయ సముద్రం, కోయిల్ సాగర్ రిజర్వాయర్‌లలో…
తాగునీటి అవసరాల కోసం రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని మిషన్ భగీరథ ఈఎన్సీని సిఎం ఆదేశించారు. కాగా ఉదయ సముద్రం, కోయిల్ సాగర్ రిజర్వాయర్‌లలో కొంత నీటి ఎద్దడి ఉందని, వాటిలో నీటి నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని సిఎం స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పంపింగ్ నిర్వహణను ప్రైవేటు కాంట్రాక్టర్లకు కాకుండా, ప్రభుత్వరంగ సంస్థ అయిన జెన్‌కోకు ఇచ్చేలా విధి, విధానాలు ఖరారు కోసం చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను సిఎం ఆదేశించారు.
మోటార్లను నిరంతరాయంగా నడిపించాలి
పాలేరు రిజర్వాయర్‌కు నాగార్జున సాగర్ నుంచి నీరు వచ్చే అవకాశాలు ప్రస్తుతం లేనందున, బయ్యన్నవాగు నుంచి నీటిని సందర్భానుసారం పాలేరుకు వదిలేలా చర్యలు చేపట్టాలని సిఎం అధికారులకు సూచించారు. ఎగువ గోదావరి నుంచి నీరు రాకున్నా, ప్రాణహిత ద్వారా నీరు మేడిగడ్డ రిజర్వాయర్ కు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుందని కెసిఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి రోజు 1 టిఎంసి నీటిని మేడిగడ్డ నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్లకు ఎత్తిపోసేలా మోటార్లను నిరంతరాయంగా 24 గంటలు నడిపిస్తూనే ఉండాలని కెసిఆర్ ఆదేశించారు. సుందిళ్ల నుంచి అంతే నీటిని మిడ్ మానేరు తరలించాలని, అక్కడి నుంచి సగం నీటిని లోయర్ మానేరుకు, సగం నీటిని వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని కెసిఆర్ అధికారులకు సూచించారు. తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తుంగతుర్తి మీదుగా సూర్యపేటలోని చివరి ఆయకట్టు చినసీతారాం తండా దాకా సాగునీరు అందేలా పకడ్భందీ చర్యలు చేపట్టాలని సిఎం పేర్కొన్నారు.
విత్తనాలు, ఎరువులు తిరిగి అందించగలిగే విధంగా….
ఇప్పటికే కురిసిన వానలకు పత్తి, తదితర విత్తనాలు వేసిన ప్రాంతాల్లో, వర్షాభావ పరిస్థితుల్లో మొలకలెత్తకుండా ఎండిపోయిన నేపథ్యంలో తిరిగి రైతులు విత్తుకునే పరిస్థితులున్నాయని, అటువంటి పరిస్థితుల్లో విత్తనాలు, ఎరువులు తిరిగి అందించగలిగే విధంగా కంటిన్ జెన్సీ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు సిఎం స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రతి రోజు మినట్ టు మినట్ రిపోర్టును సిఎం కార్యాలయానికి ప్రతి రోజు ఉదయాన్నే అందజేయాలని, ఇరిగేషన్ శాఖ, వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్ శాఖల నుంచి వ్యవసాయం, త్రాగు నీరు, సాగునీరు పంపిణీకి సంబంధించి వస్తున్న రిపోర్టులను అనుసరించి సిఎం కార్యాలయం సంబంధిత ప్రాంతాల మంత్రులు, ప్రజాప్రతి నిధులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ, అప్రమత్తం చేస్తుందని, తద్వారా ఎటువంటి సమస్య తలెత్తకుండా సమన్వయం చేస్తామని సిఎం తెలిపారు.

ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయకార్ రావు, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, ఎంఎల్‌ఎ బాల్క సుమన్, జాజుల సురేందర్, సిఎస్ శాంతి కుమారి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సిఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి ఎండి దాన కిషోర్, వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్ రావు, ట్రాన్స్ కో అండ్ జెన్ కో సీఎండి ప్రభాకర్ రావు, టిఎస్ ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, టిఎస్ ఎన్‌పిడిసిఎల్ సిఎండి గోపాల్ రావు, ఎత్తిపోతల పథకాల సలహాదారు కె. పెంటారెడ్డి, ఇరిగేషన్ శాఖ ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్, వెంకటేశ్వర్లు, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, గోదావరి, కృష్ణా నదుల ప్రాజెక్టుల ఈఎన్సీలు, నీటి శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News