Saturday, November 16, 2024

కళింగాంధ్ర సాహితీ ప్రభ

- Advertisement -
- Advertisement -

ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలం ఎంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కర లెందరో. అని మహా కవి దాశరథి కృష్ణమాచార్యలు అన్నట్లు. విస్తృత కళింగాంధ్రలో విశాల సాహిత్య సృజన చేసి కను మరుగైన కవులెందరో. అలాంటి గొప్ప వారి సాహిత్యాన్నీ. జీవిత విశేషాలు ను నేటి తరానికి అందించాలనే సదుద్దేశం తో.రా.రా.వే. చేసిన గొప్ప ఆలోచనకు కార్య రూపమే ఈ విస్మృత కళింగాంధ్ర సాహితీ ప్రభ. ఇటీవల ఆవిష్కరించుకున్న ఈ పుస్తకములో సుమారు 30వ్యాసాలు చోటుచేసుకున్నాయి. సంపాదకులు గార రంగనాధం గారు ముందు మాటతో పాటు కళింగాంధ్ర ప్రాచీన సాహితీ ప్రస్తావన చేశారు.
శాతాహనులు కంటే ముందు నుండే కళింగాంధ్రలో సాహిత్యం ఉందని అనేక ఉదాహరణలతో విపులంగా వివరించారు. శ్రీనేతేటి గనేశ్వరరావు గారు బొంతల కోడూరు జమీందారీలోని ఉన్న బెహరా రామ కృష్ణ కవి విరచితమైన నలచరిత్ర ప్రబంధం విశేషాలును, భక్త కవి యామన బసవయ్య సాహిత్యం, గున్నేశ్వర శాస్త్రి గారి రచనలు సమాజ హితం కోరేవి అయినా వారికి తగిన గుర్తింపు లభించక పోవడం దుర దృష్ట కరమని భావించారు. రాజ నీతిని రంగరించి జైత్రయాత్ర, మృత్యుంజయుడు వంటి ప్రముఖ గ్రంధాలను రచించి, సంస్కృతాంధ్రఆంగ్ల, భాషలలో పాండిత్యాన్ని సంపాందించిన గెడ్డాపు సత్యం మాస్టారు కవిత్వం సుర భిలం అని ఓమ్మి రమణ మూర్తి గారు నెమ్మి గానే చెప్పారు. అలాగే చిగురు కోట వెంకట రమణ మూర్తి గారు సావిత్రి చరిత్రం, మాయా ప్రభావం వంటి రచన లు సొగసుగా కవితా పూలు పూయించారు అని కవి హృదయాన్ని చూపించారు.
కవేరాగా పేరు పొందిన కనుగల వెంకట రావు గారు సాహిత్య నేత్రం, సాదా సీదా జీవితం నేటి తరానికి ఆదర్శం వంటి రచనలు, సిక్కోలుకే వన్నె తెచ్చారని,. అలాగే సామాజిక స్పృహను కలిగించడమే భావశ్రీ గారి భావజాలం అని పిళ్ళా తిరుపతి రావు గారు వెల్లడించారు. ఒకరు కలియుగ వాల్మీకి, మరొకరు కర్షక కవి. అని గిరిజాల లక్ష్మణ దాసు, ద్వారపురెడ్డి అప్పలనాయుడు గారి కవిత్వాన్ని ప్రస్తావిస్తూ వారికి తగిన గౌరవం దక్కలేదని గంటెడ గౌరు నాయుడు గారు అన్నారు.
దుష్ట బుద్ధి కల కైకేయిని భక్త కైకేయిగా చేసిన ఘనత ఉరిటి సూర్య నారాయణ గారిదని, అతని కవిత్వాన్ని ఎంత గానో ప్రశంసించారు పొట్నురు కోటి బాబు గారు. భజన, దాని పరిణామ క్రమాన్ని, కొన్ని భజన పాటలు. సామాజిక నేపథ్యా న్ని వివరిస్తూ, అది బహుజనులది అని డా. ఆల్తి మోహన్‌రావు గారు చక్కని వ్యాసం రాశారు.
ప్రముఖ కథ, నవలా రచయిత, రాష్ట్ర సాహిత్య అకాడమీ సభ్యులు అట్టాడ అప్పల నాయుడు గారు జాన పదుల జజ్జ నకరి అంటూ. వంగ పండు ప్రసాద రావు గారి మాట పాటను మనో రంజ కంగా విశ్లేషించారు. అదే విధంగా జ్ఞానానంద కవిని గురించి దామెర సూర్యారావు గారు, అల్లంసెట్టి అప్పయ్య కవిత్వాన్ని గార సీతా రత్నంగారు, రామ వరపు కవుల గురించి వెంకట రమణ మూర్తి గారు, అపర పింగళ సూరణ బొంగు సూర్య నారాయణ కవిత్వాన్ని రాజా పు శాంతా రావు, వారి సాహిత్యాన్నీ పరిచయం చేశారు. ఈ విస్మృత కళింగాంధ్ర. సాహితీ ప్రభ లో ని ప్రతి వ్యాసం ఆపాత మధురం,అలోచనామృతమే .నేటి తరానికి గొప్ప వరం. కళింగాంధ్ర కే గర్వ కారణం గా నిలుస్తుందన్నది నగ్న సత్యం.. ఏది ఏమైనా కలానికి, గళానికి. కులముతో, మతముతో ముడిపెట్టనపుడే కవి కి, సాహిత్యానికి. విలువ ఉంటుంది.
పుస్తకం ధర 300.పేజీలు 320. పుస్తకాలు లభించు చోటు విశాలాంధ్ర బుక్ హౌస్, నవోదయ పుస్తకశాల,హైదరాబాద్, 9885758123 గార రంగనాథం.

రాజాపు శాంతారావు
7702241896

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News