Monday, December 23, 2024

పార్టీ వీడిన నేతలంతా తిరిగి రావాలి: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్టీ వీడిన నేతలంతా తిరిగి రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్ర ముగింపు సభగా ఆదివారం సాయంత్ర కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనగర్జన సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ కారణాల చేత పార్టీ వీడిన నేతలంతా తిరిగి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన సూచించారు. కర్ణాటకలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించామని, కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలిచారని రాహుల్ తెలిపారు. కర్ణాటకలో జరిగిందే తెలంగాణలో కూడా జరుగుతుందన్నారు. తెలంగాణలో బిజెపి అడ్రస్ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. పొంగులేటితో పాటు ఆయన అనుచరులకు రాహుల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Also Read: బిఆర్‌ఎస్ బిజెపి బంధువుల పార్టీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News