Saturday, April 12, 2025

ప్రధాని మోడీ నివాసంపై డ్రోన్ కలకలం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ప్రదానమంత్రి నరేంద్ర మోడీ నివాసంపై డ్రోన్ కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ప్రధని మోడీ నివాసంపై పలుమార్లు డ్రోన్ చక్కర్లు కొట్టడం గమనించిన ఎస్పిజి వెంటనే అప్రమత్తం అయ్యింది. వెంటనే ఢిల్లీ పోలీసులకు ఎస్పిజి సమాచారం అందించింది.

ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నో ఫ్లైయింగ్ జోన్ లో డ్రోన్ ఎగురుతున్నట్లు ఎస్పిజి సమాచారం ఇచ్చిందని, డ్రోన్ సమాచారంపై దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు మీడియాకు వెల్లడించారు.

Also Read:  పార్టీ వీడిన నేతలంతా తిరిగి రావాలి: రాహుల్ గాంధీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News