Friday, December 20, 2024

సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్ టౌన్: ఖేడ్ క్యాంపు కార్యాలయంలో సోమవారం లబ్ధిదారులకు సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి తనయులు, యువనేత మహారెడ్డి రోషన్‌రెడ్డి పంపిణీ చేశారు. సిర్గాపూర్ మండలంలోని గరిడేగాంకు చెందిన నర్సన్సకు రూ.20వేలు, నారాయణఖేడ్ మండలంలోని బండ్రాన్‌పల్లికి చెందిన అనితకు రూ.21వేల సిఎం సహాయనిధి చెక్కులు మంజూరు కాగా లబ్ధిదారులకు అందజేశారు. కాగా నిధులకు కృషి చేసిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News