సిటీ బ్యూరో: జిహెచ్‌ఎంసిలో బదిలీల పర్వం ప్రారంభమైంది. గత మూడేళ్లుగా ఒకే చోట పని చేస్తున్న అధికారులకు స్థానం చలనం కల్పించాలని భారత ఎన్నికల కమిషనన్ అదేశాల మేరకు సోమవారం పలువురు జోనల్ కమిషనర్లు,డిప్యూటీ కమిషన్లర్లను బదిలీ చేస్తూ జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ఆదేశాలను జారీ చేశారు. ఇప్పటీకే బల్దియా కమిషనర్‌ను భారత ఎన్నికల కమిషనర్ రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధాన అధికారిగా నియామిస్తూ ఉత్తుర్వులను జారీ చేయసిన విషయం తెలిసిందే.. దీంతో జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్‌ను రిలివ్యూ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేయల్సి ఉంది. ఇదేక్రమంలో వివిధ నియోజవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా కీలక పాత్ర పోషించే డిప్యూటీ కమిషనర్ల బదిలీలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ బదీల్లో భాగంగా ప్రసుత్తం సికింద్రాబాద్ జోనల్ కమిషనర్‌గా సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. అక్కడ ప్రస్తుతం జోనల్ కమిషనర్‌గా పని చేస్తున్న శంకరయ్యకు ఎన్నికల అదనపు కమిషనర్ బాధ్యతలను అప్పగించారు. అదేవిధంగా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న రవి కిరణ్‌ను సికింద్రాబాద్ జోనల్ కమిషనర్‌గా బదిలీ చేయడంతో పాటు ఆయనకు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా అదనపు బాధ్యలను అప్పగించారు. ప్రస్తుతం వరకు చార్మినార్ జోనల్ కమిషనర్‌గా పని చేస్తున్న అశోక్ సామ్రాట్‌ను సిడిఎంఎ జాయింట్ డైరెక్టర్‌గా బదిలీ చేయగా, శేరీలింగంపల్లి డిప్యూటి కమిషనర్ గా పనిచేస్తున్న టి వెంకన్నను చార్మినార్ జోనల్ కమిషనర్‌గా నియమించారు. చందానగర్ డిప్యూటీ కమిషనర్‌గా విధులను నిర్వహిస్తున్న సుంధాంశును శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేయడంతో పాటు చందానగర్ డిసిగా అదనపు బాధ్యతలను అప్పగించారు.