Friday, December 20, 2024

చేపల వేటకు వెళ్లి నీటిలో మునిగి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన ఎడ్ల యాదయ్య(55) చేపల వేటకు చిన్నశంకరంపేట శివారులోని బ్రిడ్జి కింద కాలువలోని నీటిలో చేపలు పట్టడానికి ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి రాత్రి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతని కోసం వెతుకుతున్నారు. సోమవారం వెతుకుతుండగా అక్కడ పరిసర ప్రాంతాల్లో ఓ వ్యక్తి నీటిలో మునిగి తేలాడని తెలపడంతో బ్రిడ్జి వద్దకు వెళ్లగా అక్కడ అతని బైక్ కనిపించడంతో నీటిలో యాదయ్య శవంతో తేలి ఉన్నాడని కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో స్థానిక ఎస్సై సుభాష్‌గౌడ్ సంఘటన స్థలానికి వెళ్లి నీటిలో నుంచి శవాన్ని బయటకు తీయించి శవ పంచనామా నిర్వహించి అతని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ మాట్లాడుతూ… కాళ్లకు వల చుట్టుకుని నీటిలో పడి మృతి చెందిన ఉంటాడని తెలిపారు. మతునికి భార్య నర్సమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News