Friday, December 20, 2024

లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్

కడ్తాల్ : ఆమనగల్లు లయన్స్‌క్లబ్ సేవలు ప్రశంసనీయమని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ అన్నారు. కడ్తాల మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు యాచారం వెంకటేశ్వర్ల గౌడ్, ఎంపిపి దేపావత్ కమ్లీమోత్యనాయక్, జెడ్పిటిసి జర్పుల దశరథ్‌నాయక్, డిసిసిబి డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా, సర్పంచ్ గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.

మానవసేవే మాధవ సేవ అని వృద్ధులకు, బాటసారులకు లయన్స్ క్లబ్ మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా అన్నదానం నిర్వహించడం గొప్ప కార్యక్రమమని కొనియాడారు. కల్వకుర్తి నియోజకవర్గంలో లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు జూలూరి రమేష్, వెంకట్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, రమ్యశ్రీ, ధీరజ్‌కుమార్‌రెడ్డి, గోవర్థన్‌రెడ్డి, కోరివి వెంకటయ్య, సుధ చెన్నకిషన్‌రెడ్డి, రాజేందర్, లక్ష్మయ్య, ఎంగలి బాలకృష్ణ, బీచ్యనాయక్, స్థానిక నాయకులు లాయక్ అలీ, క్యామ రజేష్, గంప శ్రీను, పీఆర్వో పాషా తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News