Monday, December 23, 2024

నల్ల బ్యాడ్జీలతో ఓయూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః తమ ను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ఓయూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్ కళాశాల ముందు సోమవారం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రెగ్యులరైజ్ చేయాలని నినాదాలు చేశారు . ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఓయూ జేఏసీ చైర్మన్ డాక్టర్ ఏ పరశురాం మాట్లాడుతూ గత 60 రోజులుగా తాము ఆందోళన చేస్తున్నామని,

ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల రెగ్యులరైజేషన్ పై తగిన ప్రకటన చేసి వెంటనే ప్రక్రియను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో తమ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ కన్వీనర్ డాక్టర్ డి. ధర్మతేజ, జితేందర్ రెడ్డి, శైలజ రెడ్డి, వినీత పాండే, అంబటి శ్రీనివాస్, డి తిరుపతి, ఏ కవితా రెడ్డి, విజయ్, శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News