Friday, November 22, 2024

శృతిని ఆదర్శంగా తీసుకోవాలి: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : నీట్ పరీక్షలో454 మార్కులు సాధించి.. జాతీయ స్థాయిలో 9,292 ర్యాంకు తెచ్చుకున్న విద్యార్థిని శృతిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభినందించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని గూడూరు గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన శృతికి ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించిన ఎంబిబిఎస్ సీటు పొందే వీలున్నా.. కనీస ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేదు. ఈ విషయం తెలుసుకున్నమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే స్పందించారు. ఆ చదువుల తల్లికి బాసటగా నిలిచారు. శృతిని, ఆమె తల్లిదండ్రులను హైదరాబాద్‌కు పిలిపించుకొని శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు. నీట్‌లో సత్తా చాటిన శృతికి వెంటనే ఆర్థిక సహాయం అందచేశారు. ఆమె చదువు పూర్తి అయ్యే వరకు ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. శృతిని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News