Sunday, January 19, 2025

పధాని మోడీ ఆతిధ్యంలో నేడు షాంఘై సహకార సదస్సు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత్ అధ్యక్షతన మంగళవారం వర్చువల్ విధానంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సు ఎన్నో విశేష ప్రాధాన్యతలకు వేదిక కానుంది. సదస్సు కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ , రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ తదితర షాంఘై ప్రతినిధి దేశాల ప్రముఖులకు ప్రధాని మోడీ ఆతిధ్యమివ్వనున్నారు. భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్, కజఖ్‌స్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల ప్రాతినిధ్యంతో కూడిన ఈ షాంఘై సహకార సంస్థ ఈ గ్రూపులో కొత్త శాశ్వత సభ్యదేశంగా ఇరాన్‌కు స్వాగతం పలకనున్నది. గత వారం ఒక కిరాయి గుంపు స్వల్పకాలిక సాయుధ తిరుగుబాటుకు మాస్కో అలజడి చెందిన తరువాత ఈ బహుపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో మొదటిసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ పాల్గొంటుండడం విశేషం.

అఫ్గానిస్థాన్‌లో పరిస్థితి, ఉక్రెయిన్ యుద్ధం, షాంఘై సభ్యదేశాలకు సహకార విస్తరణ ఈ సదస్సులో ప్రధానంగా చర్చించవలసిన అంశాలుగా కనిపిస్తున్నాయి. దేశాల మధ్య అనుసంధానాన్ని, వాణిజ్యాన్ని పెంపొందించడం కూడా ప్రధానంగా చర్చకు రానున్నట్టు ఆయా వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోడీ అత్యధిక గౌరవ స్థాయిలో అమెరికాలో సాగించిన పర్యటన తరువాత రెండు వారాలకు జరుగుతున్న ఈ సదస్సులో భారత్, చైనా దేశాల మధ్య లడఖ్ సరిహద్దులో గత మూడేళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు వ్యతిరేకంగా చర్చ జరగవచ్చని భావిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 16న సమర్‌ఖండ్‌లో షాంఘై సదస్సు జరిగింది. ఆ సదస్సులో రొటేషన్ పద్ధతితో సదస్సు నిర్వహణ బాధ్యత ఈసారి భారత్‌కు లభించింది.

2018లో షాంఘై సదస్సులో ప్రధాని మోడీ ఈ సదస్సు భద్రత, ఆర్థిక, వాణిజ్య, అనుసంధానిత, ఐక్యత, సార్వభౌమత్వ, భౌగోళిక సమగ్రత, పర్యావరణ పరిరక్షణ లతో కూడిన సదస్సుగా సంక్షిప్తీకరించారు. ఐక్యరాజ్య సమితి (యుఎన్),ఏసియన్ (అసోసియేషన్ ఆఫ్ ఆగ్నేయాసియా దేశాలు),సిఐఎస్ ( కామన్‌వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్) సిఎస్‌టివొ)కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్), ఇఎఇయు( యురేసియన్ ఎకనామిక్ యూనియన్ ), సిఐసిఎ ( కాన్ఫరెన్స్ ఆన్ ఇంటరాక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఇన్ ఆసియా) తదితర ఆరు అంతర్జాతీయ , ప్రాంతీయ సంస్థలను కూడా ఆహ్వానించారు. షాంఘై సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడం అనేక ప్రాంతాల్లో చెప్పుకోదగిన కీలకమైన కార్యక్రమాలకు వీలు కల్పించింది.

అంకుర పరిశ్రమలు, ఆవిష్కరణలు, సంప్రదాయ వైద్యం, డిజిటల్ విధానం అనుసంధానం, యువత సాధికారత, బౌద్ధ వారసత్వ విధానాలను పంచుకోవడం తదితర ముఖ్యమైన అయిదు మూలస్థంభాలకు ఢిల్లీ వేదికైంది. ప్రపంచమంతా ఒకే కుటుంబం అన్న (వసుధైవ కుటుంబం ) ప్రధాని మోడీ విజన్ దేశాన్ని ముందుకు నడిపించిందని సంబంధిత వర్గాలకు చెందిన ప్రముఖుడొకరు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News