యాదాద్రి భువనగిరి :భారతదేశంలో మాననీయ కోణం తో ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలన సాగిస్తు, ప్రజల కోరికల మేరకే ప్రపంచంలోని పరిపాల రంగంలో ఎవరు చేయని విధంగా తొమ్మిదేళ్ల పాలనలో అరవై ఏళ్ల గిరిజనుల బాధలు తీర్చేలా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అద్భుతంగా నిర్వహిస్తున్నారని, ఏ రాష్ట్రంలో లేని అద్భుత పథకాలు తీసుకువచ్చి ప్రజలు మెచ్చే ప్రజలు అబ్బరపడే విధంగా పాలన కొనసాగిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాటి పాలకులు ఫ్లోరోసిస్ పాపాన్ని పెంచి పోషించారని ఆయన ఆరోపించారు. అటువంటి శాపం నుండి విముక్తి కుడా ఆరు సంవత్సరాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మటుమాయం చేశారన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గిరిజన భూమి పుత్రులకు ఆయన పొడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జిల్లాలోని చౌటుప్పల్, తుర్కపల్లి, నారాయణపురం మండలాలోని తొమ్మిది గ్రామాలకు చెందిన 205 మంది లబ్ధిదారులకు 213 ఎకరాల భూమికి ఆయన పట్టాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గిరిజనులు, గోండులు, అడవిబిడ్డల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు.పొడు భూముల పట్టాలు అందుకున్న గిరిజన రైతాంగానికి తక్షణమే రైతు బంధు పధకం అమలులోకి వస్తుందని ఆయన ప్రకటించారు.పాలనలో అద్భుతాలు సృష్టించిన నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోతారని ఆయన కొనియాడారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైనదని ఆయన పేర్కొన్నారు. తద్వారా తండాలలో వెలుగులు విరజిమ్ముతున్నాయన్నారు.
2001 నాటి పరిస్థితులను అధ్యయనం చేసిన మీదట ఇక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్ర సాధన ఉద్యమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. సాధించిన రాష్ట్రాన్ని ఈన గాసి కుక్కల పాలు చెయ్యకుండా ప్రజాదివేనల్తో అధికారంలోకి వచ్చి సంక్షేమాన్ని,అభివృద్ధి ని పరుగులు పెట్టించారన్నారు.అధికారంలోకి వచ్చిందే తడవుగా నిరంతర విద్యుత్ సరఫరా, సాగునీరు,త్రాగునీరు,కళ్యాణాలక్ష్మి/షాది ముబారక్, కేసీఆర్ కిట్ లతో పాటు లక్షకోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి చరిత్ర సృష్టించిన నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతి కెక్కారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, జడ్ పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్ది, ఇంచార్జి కలెక్టర్ దీపక్ తివారీ, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీపి రాజేశ్ చంద్ర, ఎస్ టి వెలిఫెర్ ఆఫీసర్ నాగిరెడ్డి, డిఎఫ్‌ఓ పద్మజ, ఆర్ డిఓ భూపాల్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బిక్కు నాయక్ తదితరులు పాల్గొన్నారు