Friday, November 15, 2024

గురువును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం

- Advertisement -
- Advertisement -
  • ఆజ్ఞానాందకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వారే గురువులు
  • విద్యాదరి క్షేత్ర వ్యవస్థాపకులు బ్రహ్మక్ష యాయవరం చంద్రశేఖర సిద్దాంతి శర్మ

వర్గల్: గురువు బ్రహ్మ,విష్ణు మహేశ్వరుడి స్వరూపమని గురువును పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లేనని విద్యాధరి క్షేత్ర వ్యవస్థాకులు ప్రముఖ వాస్తు సిద్దాంతి బ్రహ్మశ్రీ యాయవరం చం ద్రశేఖర్ శర్మ సిద్దాంతి అన్నారు. సోమవారం గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి సందర్భంగా విద్యాధరి క్షే త్రంలో గురుపౌర్ణమి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా వేద పం డితులు, గురువులు, ఆర్చకులు, ఆలయ కమిటీ స భ్యులు, వేద విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వారే గురువులని స్పష్టం చేశారు. గురు పౌర్ణమి పర్వదినా న గురువును సత్కరించి ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా సకల సంపదలు సిద్దిస్తాయన్నారు.

గురువుల ను పూజించే గొప్ప సంస్కృతి మనది కాగా ఆజ్ఞానందకారాన్ని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ స్వరూపమని స్పష్టం చేశారు. ఆది యోగి, గురువైన మహా శివుడు ఆషాడ పౌర్ణమి సందర్భంగా సప్తర్షులకు జ్ఞాన బోధ చేశాడని పురాణాలు పేర్కొంటుండగా ఆషాడ పౌర్ణమి రోజున దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోద చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుందన్నారు. వ్యాస మహాముని వ్యాస పౌర్ణమి రోజున సత్యవతి పరాశర మహర్షికి జన్మించగా కొన్ని ఏండ్ల అనంతరం అదే రోజున వేదాన్ని రుగ్వేదం, యుజుర్వేదం, సామవేదం, అదర్వన వేదాలుగా విభజించినట్లు చెప్పారు.

ఈ పుణ్య విశేషాన్ని పురస్కరించుకొని ఆషాడ పౌర్ణమి రోజు గురు పౌర్ణమిగా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటామన్నారు. గురు పౌర్ణమి చతుర్నాస్య దీక్ష ప్రారంభంలో వస్తుండగా శిష్యులకు జ్ఞాన బోద చేసే సమయమే చతుర్మాసమని తెలిపారు. ఈ సందర్భంలో వచ్చే తొలి పౌర్ణమినే గురు పౌర్ణమిగా పెర్కొంటుండగా తపస్సంపన్నులను పూజించి జ్ఞానాన్ని సాదించే ఆచారానికి గురు పౌర్ణమి ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News