చేర్యాల/తొగుట: పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని, విద్యార్థులకు పోలీస్ చట్టాలైన మహిళల రక్షణ, ఈవిటిజింగ్, పోక్సో, షీటీమ్స్, యాంటి హ్యుమెన్ ట్రాఫికింగ్‌లపై బాల్య వివాహాలపై, సైబర్ నేరాలపై ఎస్‌ఐ బాస్కర్ రెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ బాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చిన్న వయసులో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయవద్దని బాగా చదివించాలని సూచించారు. పిల్లలు కూడా తల్లిదండ్రులు చేస్తున్నక ష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ద వహించాలని కోరారు.కష్టపడి చదవాల్సిన వయసులో చెడు ఆలవాట్లకు బానిసలు కావద్దని, కష్టపడి చదువుకొని ఉన్నత స్ధానాల్లో స్ధిరపడాలని ఆకాంక్షించారు.
అనంతరం షీటీం కంప్లైంట్ క్యూఆర్ కోడ్‌గురించి తెలియజేస్తూ ఆన్‌లైన్ ద్వారా ఎక్కడి నుంచి అయిన ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడే ఈ షీటీమ్ కంప్లైంట్ క్యూఆర్ కోడ్ స్కానింగ్ పోస్టర్స్ జిల్లాలోని ఆర్టీసీ బస్‌లలో, బస్టాండ్, సీనిమా హాల్, స్కూల్స్, కాలేజీలలో అతికించబడి ఉంటాయన్నారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలనిసూచించారు. ఎవరైనా వేదించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100 లేదా మహిళా పోలీస్ స్టేషన్ 8712667476కు ఫోన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ఐలయ్య, స్కూల్ ఆధ్యాపకులు , షీటీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.