Monday, December 23, 2024

పోడు భూములను సాగు భూములుగా అందిస్తున్నాం

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: దశాబ్దాలుగా గిరిజనులు చదును చేసిన పోడు భూములను సాగు భూములుగా మార్చి యాజమాన్య హక్కు కల్పిస్తూ వారికే అందిస్తున్నామని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. సోమవారం జిల్లాలోని చెన్నూరు పట్టణంలోని సంతోషిమాత ఫంక్షన్‌హాల్ లో ఏర్పాటు చేసిన పోడు భూముల పట్టాల పంపిణి కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపి బోర్లకుంట వెంకటేష్‌నేత, జిల్లా అదనపు కలెక్టర్ బి రాహుల్, ట్రైని కలెక్టర్ గౌతమి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి అర్హులైన లబ్దిదారులకు పట్టాలు అందజేశారు.

అనంతరం ప్రభుత్వ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అవిర్భవించి 9 సంవత్సరాల పాలనలో ఎన్నో అభివృద్ది, సంక్షేమ పథకాలను అమలు చేసిందని, గిరిజనులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పోడు భూములను సాగు చేసుకున్న అర్హులైన గిరిజనులకు పట్టాలు అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షల 51 వేల 146 మంది పోడు రైతులకు పట్టాలు అందించడం జరుగుతుందని, జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో 666 మంది గిరిజనులకు 1 వేయి 190 ఎకరాల పోడు భూములకు సంబంధించి పట్టాలు పంపిణి చేయడం జరిగిందని తెలిపారు.

2006 ఆటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 కు ముందు వరకు సాగు చేస్తున్న వారిని అర్హులుగా గుర్తిస్తూ పోడు పట్టాలను అందించడంతో పాటు పట్టాలు అందుకున్న వారందరికి ఈ వానాకాలం నుండే రైతుబంధును అందించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో బంజారాల, అదివాసుల అత్మగౌరవాన్ని సమున్నతంగా చాటే విధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన స్థలాన్ని కేటాయించి 50 కోట్ల రూపాయలతతో సంత్ సేవాలాల్ బంజార భవన్, కుమ్రంభీం ఆదివాసి భవన్‌లో నిర్మించడం జరిగిందని తెలిపారు.

గిరిజనుల పండుగలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని, 350 కోట్ల రూపాయలను ఖర్చు చేసి మేడారంలో మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. అడవిబిడ్డల సంక్షేమమం దిశగా తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబందిత శాఖల ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News