Monday, December 23, 2024

రోడ్డుపైనే స్తంభం…అదమరిస్తే అపాయం

- Advertisement -
- Advertisement -

నెన్నెల: భీమారం నుండి చిత్తాపూర్ వరకు ఉన్న ప్రధాన క వరుస రోడ్డును రెండు వరుసల రోడ్డుగా విస్తరించారు. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలను రోడ్డుకు దూరంగా వేసిన తర్వాత రోడ్డు విస్తరణ పనులు పట్టాల్సి ఉంది. కాని అందుకు విరుద్ధంగా కాంట్రాక్టర్ స్తంభాన్ని ఏ మాత్రం పక్కకు అమర్చకుండా స్తంబాన్ని కూడా రోడ్డులో కలుపుకొని తార్ రోడ్డువేశారు.

వాహన చోదకులు వాహనాలు నడుపుతున్న సమయంలో ఏ మాత్రం గమనించకుంటే పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా స్తంభం అలాగే ఉంచడం, అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే స్తంభాన్ని తొలగించలేదని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి స్తంబాన్ని తొలగించాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News