చాంద్రాయణగుట్ట : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్వస్థీకరణలో భాగంగా విభజించిన చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్ పరిధిని స్థానిక ప్రజల అభీష్టమేరకు పూర్వపు స్థితిలోనే కొనసాగించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి నేతల బృందం సోమవారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీని కలిసి వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్ పార్లమెంట్ బిఆర్‌ఎస్ ఇంచార్జ్ పుస్తె శ్రీకాంత్, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, బార్కాస్, కంచన్‌బాగ్ డివిజన్ల బిఆర్‌ఎస్ అ ధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, ఫెరోజ్, ఫజల్, నేతలు దిలీప్, పవన్‌రెడ్డిలు కలిసి పోలీసుస్టేషన్ పరిధిని మార్చటం వల్ల ఎదురైతున్న ఇబ్బందులను మంత్రికి వివరించారు. ఎంబీఎన్‌ఆర్ చౌ రస్తా నుండి కేశవగిరి, పాత పోస్టుఆఫీస్ చౌరస్తాలకు ఒకవైపు గల శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం, సీఆర్‌పీఎఫ్, దాస్ స్కూల్, న్యూ ఇందిరానగర్ తదితర బస్తీలను బండ్లగూడ పోలీసుస్టేషన్ పరిధిలోకి మార్చటాని వ్యతిరేకించారు. కూతవేటు దూరంలో, ప్రధాన రోడ్డుకు మరోవైపు గల చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు.
బండ్లగూడ పిఎస్ నుంచి చాంద్రాయణగుట్ట పిఎస్‌కు మార్చండి
- Advertisement -
- Advertisement -
- Advertisement -