Monday, December 23, 2024

నంబర్ ప్లేట్ లేని వాహనంలో తిరిగితే కఠిన చర్యలు: డిఎస్ చౌహాన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్ అధికారులతో రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెడికల్ ఎమర్జెన్సీ కల్పించేలా చర్యలు తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సరైన చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటి వరకు చాలా రోడ్డు ప్రమాదాలను తగ్గించామన్నారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన అధికారులకు నగదు బహుమతి కూడా ఇస్తున్నామన్నారు. నంబర్ ప్లేట్ లేని వాహనంలో తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read: హనుమకొండలో విద్యార్థినిపై స్నేహితుడు అత్యాచారం…

ఫేక్ నెంబర్ ప్లేట్స్ పై ఆరు నెలల్లో 60 వేల వాహనాలపై కేసులు నమోదు చేశామన్నారు. ట్రాఫిక్ సిబ్బందికి విధుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రత కల్పిస్తున్నామన్నారు. రాష్ట ప్రభుత్వం విడుదల చేసిన 2 కోట్ల రూపాయలతో ట్రాఫిక్ అధికారులకు ట్రాఫిక్ సేఫ్టీ పరికరాలు అందించామన్నారు. ఎసి హెల్మెట్, ల్యాప్ టాప్స్, జంగిల్ షూ, వాటర్ బాటిల్స్, రీప్లెక్టీవ్ జాకెట్స్, ఎల్ఈడి బ్యాటన్స్, ట్రాఫిక్ పోలీసులకు మౌలిక సదుపాయాలు అందించిన ప్రభుత్వానికి డిఎస్ ధన్యవాదములు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News