Thursday, April 17, 2025

ఎపి బిజెపి అధ్యక్షురాలిగా పురందేశ్వరి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణ, ఎపి రాష్ట్రాల్లో బలమైన పార్టీగా ఎదిగేందుకు బిజెపి హైకమండ్ అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎపి రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజును తొలగించింది.

ఆయన స్థానంలో పురందేశ్వరిని రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా నియమించింది. దీంతో సోము వీర్రాజుకు కొత్త బాధ్యతలు అప్పగించనున్నారు. మరోవైపు తెలంగాణలోనూ బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: బండి సంజయ్ ఔట్.. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి..!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News