Monday, December 23, 2024

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -
  • అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు: సిఎం కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ గ్రామల అభివృద్ధే ధ్యేయంగా పనిచేసుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గణాపూర్ గ్రామంలో రూ. కోటి 10 లక్షలతో సిసి రోడ్లు, గ్రామ పంచాయతీ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ కావ్య కాశిరెడ్డితో కలసి శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ హయాంలో అభివృద్ధికి నోచుకుంటున్నాయన్నారు.గ్రామాల అభివృద్ధితో గ్రామల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

ప్రతి గ్రామానికి ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధిలో ముందుకు తీసుకెల్లుతున్నట్టుగా చెప్పారు. సిఎం కెసిఆర్ దూర దృష్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంల తీసుకెల్లుతుందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి శాశ్వత భవనాలు నిర్మిస్తున్నట్టుగా తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపొందే విధంగా అన్ని చర్యలు చేపట్టినట్టుగా చెప్పారు. గ్రామాలు పరిశుభ్రతతో ఉన్నప్పుడే ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నారు. వారి వారి గ్రామల అభివృద్ధిలో గ్రామస్తులు భాగస్వాములు కావాలన్నారు. రానున్న ఎన్నికల్లో కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్‌కి పూర్తి మద్దతు ఇచ్చి మంచి మెజార్టీతో గెలుపించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి సుష్మశ్రీ వేణుగాపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపిటిసి నీనా రెడ్డి, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, దశరత్ రెడ్డి, వెంకట్ రెడ్డి , నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News