Saturday, December 21, 2024

తెలంగాణ విద్యార్థులకు 15శాతం మెడికల్ సీట్ల పెంపు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : తెలంగాణ విద్యార్థ్దులకు మెడికల్ సీట్లు 15శాతం పెంపు పట్ల ఖమ్మంలోని డాక్టర్స్ మెడికల్ అకాడమీ డైరక్టర్లు రాయల సతీష్‌బాబు, ఈగ భరణికుమార్, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ సిఎం చంద్రశేఖర్‌రావు, ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు , రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ల ప్లెక్సీలకు మంగళవారం పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా ఆంధ్రా ప్రాంతం వారు ఓపెన్ కేటగిరిలో ఈ సీట్లను పొందుతున్నారని చెప్పారు. డాక్టర్స్ మెడికల్ అకాడమీ తరపున ఈ విషయంపై మంత్రి హరీశ్‌రావుకు వారం క్రితం విన్నవించటం, తరువాత దానికి ఆమోదం రావడం కూడా జరిగిందని పేర్కొన్నారు.

రాష్ట్ర మంత్రి హరీష్‌రావు చొరవతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మనం స్తాపించుకున్న మెడికల్ కళాశాలల్లోని సీట్లను మన రాష్ట్ర విద్యార్థులకే దక్కేలా జీవో జారీ చేసారని అన్నారు. ఇందుకు తమ అకాడమీ తరపున హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. దీని వలన కనీసం 400 మంది విద్యార్దులు గత సంవత్సరం కంటే ఎక్కువగా లబ్ధ్దిపొందుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News