Saturday, December 21, 2024

హోటల్‌లోకి దూసుకెళ్లిన ట్రక్కు: 10 మంది మృతి (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్ర లోని ధూలే జిల్లాలో మంగళవారం హైవేపై ప్రయాణిస్తున్న ఓ లారీ అదుపు తప్పి వాహనాలను ఢీకొడుతూ ఓ హోటల్ లోకి దూసుకెళ్లడంతో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని సిర్పూర్, ధూలే లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.

పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం మధ్య ప్రదేశ్ నుంచి ధూలే వైపు వెళ్తున్న లారీ మంగళవారం ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ముంబై ఆగ్రా హైవేపై పలస్నేర్ గ్రామ సమీపంలో బ్రేకులు ఫెయిలవడంతో రెండు మోటార్ సైకిళ్లను, ఓ కారును , మరో కంటెయినర్‌ను ఢీకొట్టింది. అదే వేగంతో బస్టాప్ పక్కన ఉన్న ఓ హోటల్ లోకి దూసుకెళ్లి తర్వాత తలకిందులైంది. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో బస్టాప్‌లో బస్సుకోసం వేచి చూస్తున్న ప్రయాణికులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంపై పోలీస్‌లు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News