Monday, November 25, 2024

మాధక ద్రవ్యాల నిర్మూలన సమిష్టి కృషితోనే సాధ్యం

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ : మహిళా శిశు దివ్యాంగుల , వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం 2023 పురస్కరించుకొని స్థానిక సిద్ధార్థ జూనియర్ కళాశాల వికారాబాద్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి కేతావత్ లలిత కుమారి మాట్లాడుతూ విద్యార్థులు, యువత జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న మాదక ద్రవ్యాల నిర్మూలన సమష్టి కృషితోనే సాధ్యమవు తుందని పేర్కొన్నారు. పిల్లలు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగాన్ని నిర్మూలించేందుకు విద్యార్థులు, యువతలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరముందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంతో ఏటా అనేక మంది తమ జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్నేహితుల ద్వారానే విద్యార్థులు, యువత డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని, క్రమేపీ వ్యసనపరులుగా మారుతుండడం పలు సందర్భాల్లో తేటతె ల్లమైందన్నారు. మిత్రుల ఎంపికపై ఆచితూచి వ్యవహరించాలని, సోషల్ మీడియా వినియోగంపై కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయి ఉద్యోగాలు కూడా సంపాదించవచ్చని, ఇందుకు నిదర్శనమే నేడు తెలంగాణ రాష్ట్రంలో బాలురు బాలికలు వివిధ రంగాలలో సాధించిన అభివృద్ధి మనకు కనిపిస్తుందన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిపై చిన్నచూపు చూడడం తగదన్నారు.

వికారాబాద్ జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. డ్రగ్స్ వినియోగం మూలంగా మనిషి ప్రవర్తనలో క్రమేపీ మార్పు వచ్చి దీర్ఘకాలిక దుష్ప్రభావం కలుగుతుందన్నారు. నాడీ వ్యవస్థతో పాటు కాలేయం, నరాలు, ఇతర శరీర భాగాలపై తీవ్ర ప్రభావం చూపి, మరణం సంభవించే ప్రమాద ముందన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారిని గుర్తించి, రీహబిలిటేషన్ సెంటర్కు తరలిస్తే, వారిలో మార్పు వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర మాట్లాడుతూ, సమాజాన్ని పట్టి పీడిస్తున్న భూతం మాదక ద్రవమన్నారు. ప్రజల్లో మార్పుతోనే దీనిని నిర్మూలించ వచ్చని చెప్పారు. మాదక ద్రవ్యాల వినియోగంతో నేరాలు పెరుగుతున్నాయన్నారు. గంజాయి, నల్ల మందు, కొకైన్, ఇతర మాదక ద్రవ్యాలు జిల్లాలో ఎక్కడైనా లభించినట్లు తెలిస్తే, పోలీసులకు వెంటనే సమాచారమివ్వాలని కోరారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ స్టాటిస్టికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ మాట్లా డుతూ, మాదక ద్రవ్యాల వినియోగంతో కుటుంబం చిన్నాభిన్నం అవుతుందన్నారు. వీటికి బానిసలుగా మారుతున్న వారిలో అత్యధికశాతం దినసరి కూలీలు అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు ముఖ్యంగా డ్రగ్స్ అలవాటు పడిన వారిలో యువత ఎక్కువ ఉంటున్నారని గుర్తించినట్లు వెల్లడించారు. యువత జీవిత లక్ష్మాన్ని నిర్దేశించుకుని దానిని సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మాదకద్రవ్యార్థ జీవిత నరకం వద్దు మాదకద్రవ్యాల వాడకం అనే నినాదాలతో రూపొందించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో లోకల్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీఐ రాఘవీణ, ఎస్త్స్ర వీరాంజనేయులు, స్థానిక సిడిపిఓ వెంకటేశ్వరమ్మ, కళాశాల వైస్ ప్రిన్సిపల్ శివారెడ్డి, డవ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మల్లారెడ్డి, ఎఫ్ ఆర్ ఓ వెంకటేష్ హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News