Tuesday, November 5, 2024

మొక్కుబడిగా జడ్పీ సమావేశం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి : జిల్లాలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలపై చర్చించి పరిష్కరించడానికి ముచ్చటగా మూడు నెలలకొసారి నిర్వహించే సర్వసభ్య సమావేశం మొక్కుబడి తంతుగా ముగిస్తున్నారు. మంగళవారం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అనితా రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశం తంతుగానే ముగిసింది. మూడు నెలలకొసారి నిర్వహించే సమావేశంకు ప్రజా ప్రతినిధులు హాజరుకాకపోవడం….హాజరైన వారు సైతం ఎప్పుడు బయట పడదామా స్వంత పనులు చేసుకుందామా అన్న హడావిడి తప్ప ఎజెండాలో పొందు పర్చిన అంశాలతో పాటు తమను ఎన్నుకున్న ప్రజలు పడుతున్న భాదలు, సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలన్న ఆలోచనలో లేకపోవడం బాధాకరం. 11 గంటలకు సమావేశం అని ప్రతిసారి పెర్కొనడం తప్ప ఎనాడు సకాలంలో సమావేశం ప్రారంబించే అనవాయితి లేని అధికారులు 12.10 సమావేశం ప్రారంభించడం చిత్తశుద్దిని తెలియచేస్తుంది.

మంగళవారం జడ్పీ సమావేశానికి మంత్రి సబితారెడ్డి హాజరయ్యారు. కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్ ఆలస్యంగా వచ్చి ఒక్క విషయంపై ఉపాన్యాసం ఇచ్చి వెళ్లిపోయారు. జిల్లా పరిషత్‌లో చెవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, భువనగిరి ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పాలమూరు ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కల్వకుర్తి ఎంపి రాములు సైతం హజరవ్వవలసి ఉండగా ఎవరు అటువైపు కన్నెత్తి చూడలేదు. శాసనమండలి సభ్యులు ఒక్కరు కూడ దారిదాపుల్లోకి రావడం లేదు. పట్టబద్రుల స్థానం నుంచి ఎంపికైన వాణిదేవి, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు ఎ.వి.ఎన్ రెడ్డి సైతం అడుగుపెట్టలేదు. కల్వకుర్తి శాసనసభ్యులు మినహ మిగత శాసనసభ్యులు ఎవరు సమావేశంకు హజరవ్వలేదు. జిల్లాలోని పలు మండలాల జడ్పీటిసి, ఎంపిపిలు సైతం సమావేశంకు వైపు రాకుండా స్వంత పనులలో బిజిగా ఉండటం విశేషం. అధికార పార్టీకి చెందిన పలువురు జడ్పీటిసిలు సమావేశం హల్‌లోకి వచ్చి సమావేశం ప్రారంభమయిన వెంటనే బయటకు వెళ్లిపోగా మరికొంత మంది సమావేశం హల్‌లో ఉన్న కనీసం నోరు విప్పకపోవడం విశేషం. పలువురు ఎంపిపిలు, జడ్పీటిసిలు తమ మండలంలో ఎలాంటి సమస్యలు లేవన్న మాదిరిగా మౌనంగా సమావేశ హల్‌లో కాలక్షేపంలో మునిగితేలారు.
సమావేశం ప్రారంబం కాగానే జంప్: జడ్పీలో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా ఇబ్రహింపట్నం జడ్పీటిసి మహిపాల్ వ్యవహరిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా జిల్లాలో ప్రజల సమస్యలను సభ దృష్టికి తీసుకురావలసిన సదరు నాయకుడు సమావేశం ప్రారబమయ్యేంతవరకు హల్‌లోకి ఆటుఇటు తిరిగి సమావేశం ప్రారంభమయిన ఐదు నిమిషాల్లోనే జంప్ కొట్టడం విశేషం. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో జడ్పీటిసి సమావేశంకు రాకపోవడం షరామామూలే. తలకొండపల్లి జడ్పీటిసి, ఎంపిపిలు ప్రతిసారి మాదిరిగానే తమ మండల సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. గతంకు భిన్నంగా వారు సైతం మద్యలోనే వెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News