Monday, December 23, 2024

బంధుల పేరిట దోచుకుంటున్న ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

లోకేశ్వరం : పూటకో బంధుల పేరిట సీఎం కెసిఆర్, కెసిఆర్ కుటుంబీకులు , అనుచర వర్గీయులు రాష్ట్రాన్ని రాబందుల్లా దోచుకుంటున్నారని ముథోల్ నియోజకవర్గ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోస్లే మోహన్ రావు పటేల్ అన్నారు. మండలంలోని సేవలాల్ తండా లక్ష్మీ నగర్ తండా, నరసింహ నగర్ తండా, రాజేష్ తాండా బాలాజీ తాండా గ్రామాలలో మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు పటేల్ పర్యటించి పల్లె పల్లెకు బిజెపి గడపగడపకు మోహన్ రావు, మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన రచ్చబండలో ఆయన మాట్లాడుతూ కనీసం ఇప్పటికి నూతన పెన్షన్లు, మహిళలకు పావులా వడ్డీ రుణాలు, రేషన్ కార్డులు మంజూరు చేయని ప్రభుత్వం దళిత బంధు, గిరిజన బంధు,బిసి కులవృత్తులకు రుణాల పేరిట అమాయకులకు ప్రలోభాలకు గురిచేస్తున్న విషయం ప్రజలకు తెలిసిపోయిందని రాష్ట్రంలో ఇక కెసిఆర్ ఆటలు సాగవని మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కెసిఆర్ ప్రభుత్వం ఇప్పటికి రుణమాపి చేయలేదని కనీసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసినా అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులు పరిహారం పొందేవారు, దేశానికి వెన్నెముక రైతు అని రైతుని రాజు చేయడమే బిఆర్‌ఎస్ ప్రభుత్వ లక్షం అంటూ కళ్లబొల్లి మాటలతో రైతులను నట్టేట ముంచుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల మెటర్లకు మీటర్లు బిగిస్తామని అబద్దపు ప్రచారం చేస్తున్న కెసిఆర్‌ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని ప్రపంచ దేశాలు నివ్వేరబోయేలా దేశాన్ని అభివృద్ది చేస్తున్న మోడీ పాలన రాష్ట్రంలో రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బిజెజి నాయకులు కార్యకర్తలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News