Saturday, December 21, 2024

ఎన్‌సిపి సంక్షోభంపై న్యాయ నిఫుణుల సలహా తీసుకొంటున్న శరద్‌పవార్

- Advertisement -
- Advertisement -

ముంబయి: తన అన్న కుమారుడు అజిత్ పవార్ తిరుగుబాటుతో పార్టీలో తలెత్తిన సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు మంగళవారం తెలిపాయి. సోమవారం రాత్రి సతారానుంచి ముంబయి చేరుకున్న శరద్‌పవార్ ప్రస్తుతం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై న్యాయ కోవిదులతో చర్చిస్తున్నట్లు ఎన్‌సిపి జాతీయ అధికార ప్రతినిధి క్లైడే క్రాస్టో చెప్పారు.

ఇది రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌కు సంబంధించిన అంశం గనుక దీనిపై న్యాయనిపుణుల సలహా తీసుకోవడం అవసరమని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని వివిధ అంశాలకు సంబంధించినది. కాగా అజిత్ పవార్ గ్రూపునకు 3 మందికంటేఎక్కువ మంది ఎంఎల్‌ఎ మద్దతు లేదని చెప్పిన క్రాస్టో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిపై చర్య తీసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

బుధవారం శరద్ పవార్ ఏర్పాటు చేసిన సమావేశంలలో ఆయనకు ఎంత మద్దతు ఉందనే దానిపై స్పష్టత వస్తుందని కూడా ఆయన చెప్పారు. 53 మంది ఎన్‌సిపి ఎంఎల్‌ఎలలో 40 మందికి పైగా మద్దతు తమకు ఉందని అజిత్ పవార్ వర్గం చెప్పుకొంటున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News