Monday, December 23, 2024

కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు

- Advertisement -
- Advertisement -

ఆమనగల్లు : కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ అని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ అన్నారు. రాహుల్ గాంధీకి కనీస రాజకీయ పరిజ్ఞానం లేదని ఆయన విమర్శించారు. మంగళవారం నగరంలోని తన నివాసగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖమ్మంలో జరిగిన సభలో కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ బీఆర్‌ఎస్ పార్టీ అంటే కుటుంబ పాలన అని పదే పదే మాట్లాడరాని కుటుంబ పాలన మీది కాద అని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్య పాలన సాగిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఈ దేశంలో ఎక్కడ అమలు కావడం లేదన్నారు. సంక్షేమ పథకాల విషయంలో కుల, మత, వర్గ, ప్రాంత విభేదాలు లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కోనియాడారు. ఈ సంక్షేమ పథకాలు చూసి ప్రపంచం మొత్తం హర్షిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ దేశాన్ని 56 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో పెద్దగా చెప్పుకోదగిన అభివృద్ధి పనులు ఏమి చేయలేదన్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ 9 సంవత్సరాల కాలంలోనే అభివృద్ధిని చేసి చూపించిన ఘనుడు అన్నారు.

మిషన్ భగీరథ వంటి ఎన్నో గోప్ప పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి, ప్రజల మనస్సును దోచుకున్న పార్టీ బీఆర్‌ఎస్ అని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినితి జరిగిందని చెబుతున్న రాహుల్‌గాంధీకి కనీస రాజకీయ పరిజ్ఞనం లేదని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 95 వేల కోట్లు అయ్యిందని, లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆయన స్థాయికి తగదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎద్దెవా చేశారు. ఆసరా చేయూత పథకం ద్వారా 4 వేలు ఇస్తామంటున్న అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఎన్ని రాష్ట్రాల్లో 4 వేల ఫించన్ ఇస్తున్నారని ప్రశ్నించారు. కర్నాటకలో బీజేపి ప్రభుత్వం అవినీతిలో కురుకుపోయిందని అందుకే అక్కడి ప్రజలు ప్రత్యమ్మాయ్యంగా అయిన కాంగ్రెస్‌కు పట్టం కట్టారని ఆ గెలుపును చూసుకోని తెలంగాణలో వంద సీట్లు గెలుస్తాం అనడం మీ అవివేకానికి నిదర్శనమి అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూడ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అన్ని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మె పరిస్థితిలో లేరని రానున్న ఎన్నికల్లో ప్రజలే మరోసారి బీఆర్‌ఎస్‌కు పట్టం కడతారని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ తెలిపారు. సమావేశంలో మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ఎంపీపీలు జక్కు అనంతరెడ్డి, గంప గోవర్థన్, మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్‌యాదవ్, మాడ్గుల మండల పార్టీ అధ్యక్షులు ఏమిరెడ్డి జైపాల్‌రెడ్డి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News