- Advertisement -
హైదరాబాద్ : నేషనల్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ పోర్టల్ ను ఉపయోగించి ఓటర్ జాబితా, ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే అంశాలపై ఎన్నికల సిబ్బందికి కేంద్ర ఎన్నికల సంఘం అవగాహన కల్పించింది. మంగళవారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నేషనల్ గ్రీవెన్స్ రిడ్రెసల్ పోర్టల్ పై పలు సూచనలు చేశారు.
నేషనల్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ పోర్టల్ ను ఉపయోగించి ఓటర్ జాబితా, ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే సందేహాలను, అభ్యంతరాలను ఓటర్ల నుంచి స్వీకరించి వాటినే త్వరగా పరిష్కరించే విధానంపై అవగాహన కల్పించారు. ఈ పోర్టల్ ద్వారా స్వీకరించే సందేహాలను, విన్నతులను అన్ని స్థాయిల అధికారులు త్వరితగతిన, క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు అవగాహన పెంపొందించాలని సూచించారు.
- Advertisement -