Monday, December 23, 2024

కొత్త మార్కెట్లలో 1000 హోటళ్ల విస్తరణకు ఓయో మద్దతు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గ్లోబల్ హాస్పిటాలిటీ టెక్నాలజీ కంపెనీ ఓయో 2023 డిసెంబర్ నాటికి యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌లో భాగంగా 1000కి పైగా హోటళ్లను జోడించనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ హోటళ్లను నిర్వహిస్తున్న 100 కంటే ఎక్కువ మొదటి తరం హోటళ్ల యజమానులను జోడించాలని యోచిస్తోంది. కొత్త మార్కెట్లలో విస్తరణను సులభతరం చేయడానికి ఓయో ఇప్పటికే రూ.10 కోట్ల విలువైన సహాయాన్ని అందించింది.

2023 మార్చిలో ప్రోగ్రామ్ ప్రారంభించినప్పటి నుండి ఓయో ఇప్పటికే 30 హోటల్ యజమానులు, 250 హోటళ్లకు మద్దతు ఇచ్చింది. దీంతో హోటల్ యజమానులు ఆదాయంలో 20% వృద్ధిని నమోదు చేసుకున్నారు. ఢిల్లీలో ఈ ప్రోగ్రామ్‌లో ఎక్కువ మంది హోటల్ యజమానులు ఉండగా, ఆ తర్వాత హైదరాబాద్, బెంగళూరు ఉన్నాయని ఓయో చీఫ్ మర్చంట్ ఆఫీసర్ అనూజ్ తేజ్‌పాల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News