Monday, December 23, 2024

వర్షాకాలంలో జంతువులను గాయపర్చకండి రతన్ టాటా విజ్ఞప్తి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వర్షాకాలంలో ఆశ్రయం లేని జంతువులు వాహనాల కింద తలదాచుకుంటాయని, వాటిని గాయపర్చవద్దని ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రతన్ టాటా ఒక ట్వీట్ ద్వారా ఈ విషయం వెల్లడించారు. వర్షాకాలం వచ్చింది కావున చాలా వీధికుక్కలు, పిల్లులు కార్ల క్రింద ఆశ్రయం పొందుతాయి. అందువల్ల కార్లను ప్రారంభించే ముందు వాటి కింద తనిఖీ చేయడం అవసరం, తద్వారా జంతువులు గాయపడకుండా రక్షించవచ్చని అన్నారు. ఈ వర్షాకాలంలో వాటికి తాత్కాలిక ఆశ్రయం కల్పించడం ద్వారా మానవత్వం చూపాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News