Saturday, November 16, 2024

మిషన్ భగీరథ ప్లాంటును సందర్శించిన శిక్షణ ఐఎఎస్‌ల బృందం

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తాగునీటిని నల్లాల ద్వారా అందిస్తున్న మిషన్ భగీరథ ఒక అద్భుతమైన పధకమని శిక్షణ ఐఎఎస్‌ల బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మిషన్ భగీరథ ప్లాంటును హైదరాబాద్‌లోని ఎంసిఆర్‌డి సంస్థలో శిక్షణ పొందుతున్న 2022 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్‌ల బృందం సందర్శించింది. ఎంసిఆర్‌డి సంస్థ డైరక్టర జనరల్ బెనహర్ దత్తు ఎక్కా ఐఎఎస్ ఆదేశాల మేరకు కోర్సు డైరక్టర్ ఎఎస్ రామచంద్ర సూచనతో నోడల్ అధికారి డా. శ్రీనివాస్ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ప్లాంటును సందనకు వచ్చిన ఐఎఎస్‌లు ప్లాంటులోని వివిధ విభాగాలను పరిశీలించారు.

ప్లాంటుకు భారీ పైపులైన్లద్వారా చేరుతున్న నీటిని శుభ్రపరిచి ప్రయోగ శాలలో పలు పరీక్షల తర్వాత తిరిగి పైపుల ద్వారా వివిధ గ్రామాలకు సరఫరా చేస్తున్న తీరును శిక్షణ ఐఎఎస్‌ల బృందానికి మిషన్ భగీరథ గ్రిడ్ డిఇఇ నాగార్జున , డిఇ వెంకటేష ఇంట్రా డిఇఇ సుమలత తదితరులు వివరించారు. ఈ సందర్భంగా నీటి శుభ్రతకు తీసుకుంటున్న చర్యలను, మిషన్ భగీరథ ప్లాంటు ఉద్దేశం ప్లాంటు రూపకల్పన , నీటి సరఫరా తదితర అంశాలను వారికి అధికారులు చెప్పినపుడు వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News