Monday, January 20, 2025

బూత్ స్థాయిలో పార్టీ పునఃనిర్మాణానికి చర్యలు చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్ ః రాంనగర్ డివిజన్‌లో బిఆర్‌ఎస్ పార్టీ పునఃనిర్మాణానికి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆ పార్టీ గ్రేటర్ నాయకులు ముఠా జైసింహ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బిఆర్‌ఎస్ రాంనగర్ డివిజన్ విస్తృత స్థాయి సమావేశం కాకతీయ స్కూల్‌లో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ముఠా జైసింహ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో డివిజన్ నాయకత్వం బూత్ స్థాయిలో పార్టీ పటిష్ఠత కోసం చర్యలు చేపట్టాలన్నారు. డివిజన్ స్థాయిలో నాయకత్వాల మధ్య ఏమైనా పొరపొచ్చాలు ఉన్నా.. దిద్దుబాటు చేసుకోవాలన్నారు. నాయకత్వం అంతా ఏకమై ప్రజలకు, కార్యకర్తలకు ఐక్యత సందేశం ఇవ్వాలన్నారు.

నూతన ఓటర్ల జాబితాలో మన పార్టీ కుటుంబాలకు చెందిన అర్హులైన యువతీ, యువకులను నమోదు చేయించాలన్నారు. రెండు, మూడ్రోజుల్లో బూత్ కమిటీలు వేయాలని ఆదేశించారు. రాంనగర్ డివిజన్ అధ్యక్షులు రావులపాటి మోజస్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి మన్నె దామోదర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు వెల్లంకి ఇంద్రసేనా రెడ్డి, మహిళా కమిటీ అధ్యక్షురాలు కె. నీలాదేవి, బిసి విభాగం అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గౌడ్, ఎస్‌సి విభాగం అధ్యక్షులు టివి రాజు, మైనార్టీ విభాగం అధ్యక్షులు సయ్యద్ అలంధర్ హుస్సేన్, గిరిజన విభాగం అధ్యక్షులు కళ్యాణ్ నాయక్, ట్రేడ్ సెల్ విభాగం అధ్యక్షులు ఎంవి జనార్థన్, సీనియర్ నాయకులు ముదిగొండ మురళి, గజ్జల సంపూర్ణ, కల్పన, కొండమడుగు మధు, ప్రవీణ్ ముదిరాజ్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News