Sunday, December 22, 2024

బోనాల పండుగకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

తార్నాక: బోనాల పండుగ సందర్బంగా సికింద్రాబాద్ నియోజికవర్గంలోని అన్ని దేవాలయాలలో అదికారులు తగిన ఏర్పాట్లు చేయాలని డిప్యూటి మేయర్ మోతే శ్రీలతశోభన్డ్డ్రి పేర్కోన్నారు.ఈ మెరకు తార్నాక క్యాంపు కార్యలయంలో బిఆర్‌ఎస్ విబాగం అద్యక్షుడు మోతే శోభన్‌రెడ్డితో కలిసి వివిద శాఖల అదికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతు అన్ని దేవాలయాల్లో విద్యుత్ దీపాలు,నిరంతర శానిటేషన్ మంచినీటి సరఫరా ఏర్పాట్లును అదికారులు నిత్యం పర్యవేక్షించాలని అదేశించారు.అవసరమైన దేవాలయాలకు మరమ్మత్తులు,రోడ్లు,అవసరమైతే కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని అన్నారు.హార్టికల్చర్ విభాగం అదికారులు దేవాలయ పరిసరాల్లోని చెట్ల కొమ్మలను తొలగించాలని తద్వారా అమ్మవారి ఊరేగింపులో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి,ఏఎంసి,శానిటేషన్,ఇంజనీరింగ్,ఎంటమాలజీ,టౌన్ ప్లానింగ్,ఎలక్ట్రిసిటీ,హార్టికల్చర్,జలమండలి విబాగం అదికారులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News