Thursday, November 14, 2024

హైదరాబాద్ లో అభివృద్ధి విప్లవంగా కొనసాగుతోంది.

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో హైదరాబాద్ మానవ వనరులు, నైపుణ్యానికి రాజధానిగా మారిందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు రావు అన్నారు. బుధవారం నగరంలోని నానక్ రామ్ గూడలో స్టెల్లాంటిస్ డిజిటల్ హబ్ ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ..”సస్టెయినబుల్ మొబిలిటీకి మాత్రమే భవిష్యత్తు ఉంది. మొబిలిటీ వ్యాలీలో సెల్లాంటిస్ భాగస్వామ్యం కావడం సంతోషకరం. హైదరాబాద్ లో అభివృద్ధి విప్లవంగా కొనసాగుతోంది.

వ్యాపార విస్తరణకు హైదరాబాద్ ఎంతో అనుకూలమైంది. ప్రతి రెండు ఐటి ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్ లోనే.ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటిహబ్ లను ప్రోత్సహిస్తున్నాం. సమర్థ ప్రభుత్వం, పటిష్ట నాయకత్వం వల్లే పెట్టుబడులు వస్తున్నాయి.  2014 నుంచి పట్టణాల అభివృద్ధిపై మధ్యాహ్నం పురపాలిక శాఖ దశాబ్ది నివేదిక విడుదల చేయనున్నాం. పారదర్శకత, జవాబుదారితనం లక్ష్యంగా దశాబ్ది నివేదిక ఉండనుంది” అని పేర్కొన్నారు.

Also Read: వర్షాలు రాకున్నా.. కాళేశ్వరం ధైర్యంతో రైతులు నారు పోశారు: హరీశ్ రావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News