Tuesday, January 14, 2025

ఎంఎల్ఎ రఘునందన్‌రావు అరెస్టు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి దుబ్బాక ఎంఎల్ఎ రఘునందన్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం హైదరాబాద్ నుంచి గజ్వేల్ వెళ్తుండగా హకీంపేట వద్ద రఘునందన్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఇటీవల గజ్వేల్‌లోని శివాజీ విగ్రహం ముందు ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయడంపై బిజెపి నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.

దీంతో గజ్వేల్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును పటిష్టం చేశారు. ఈ నేపథ్యంలో గజ్వేల్‌కు వెళ్తున్న రఘునందన్‌రావును పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Also Read: పురపాలకశాఖ దశాబ్ది నివేదికను విడుదల చేసిన కెటిఆర్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News