సదాశివనగర్ : కూర గాయల ధరలు కొండెక్కి సామాన్య ప్రజలకు అందనంత దూరంలోకి చేరాయి. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావర వస్తువుల ధరలకు తోడు కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. ప్రస్థుతం మాంసాహారం కంటే శాఖాహారమే ఖరీదుగా మారింది. గతంలో 5 రూపాయలకే కిలో లభించిన టమాలకు నేడు ధర భారీగా పెరిగి వందకు దాటింది. పేద మత్యతరగతి కుటుంబాలు 2 నుంచి మూడు వందల రూ పాయలతో వారంకు సరిపడా సంచి నిండా కూరగాల తీసుకొచ్చుకునేవాళ్లు. నేడు రెండు వందలు కిలోనర టమాటాలు వస్తున్నాయి.
సదాశివనగర్ మండలం పద్మాజివాడి చౌరస్తాలో బుదవారం సంతలో టమాట, కాకర కాయ ధర 120 పలికింది. బెండకాలు, చిక్కుడు, వంకాయలతో పాటు ఆకు కూరల ధరలు వందకు తక్కువ లేనేలేవు. వర్షాలు లేక సొంతగా కూరగాయలు పండించుకుని తీనే రైతులు సైతం వ్యాపారస్తుల వద్ద కొని తినే పరిస్థితి వచ్చింది. బోర్లు,బావులు ఉన్న కొంతమంది మాత్రమే కూరగాయలు పండిస్తున్నారు. రూరగాలు పండించే వారికి మంచి ఆదాయం వస్తున్నప్పటికీ పెరిగిన ధరలతో సాధారణ ప్రజలకు మాత్రం భారంగా మారిందనే చెప్పుకోవాలి.