Monday, December 23, 2024

మంకీఫుడ్ కోర్టు వెనుక మర్మమేమిటి ?

- Advertisement -
- Advertisement -

రాజంపేట్ : మండలంలోని షేర్ శంకర్‌తాండలో మంకీఫుడ్‌కోర్టును (కోతుల హారశాల) గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రి ట్రాక్టర్లతో దున్నివేసి భూమిని కభ్జాకు పాల్పడిన వారి విషయంలో అధికారులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా 2 లక్షల 50 వేల రూపాయల విలువతో ఎర్పాటు చేసిన మంకీఫుడ్ కోర్టులో వివిధ రకాల పండ్ల మెక్కలు, కోర్టు చుట్టూ పెన్సింగ్ వైరు, స్తంబాలు ఎర్పాటు చేసి మెక్కలు పెంచుతున్న క్రమంలో తాండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మంకీఫుడ్ కోర్టు ధ్వంసం చేశారు. ఈ ఘటనలకు సంబంధించి పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, కారోబర్ లు స్థానిక పోలీసులకు, అధికారులకు గ్రామస్తులతో కలసి ఫిర్యాదు చేశారు

. అయితే వారం రోజులు అయిన ఇంత వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకకోక పోవడంతో దీనివెనుక మర్మమేమిటీ అంటు గ్రామస్తులు వాపోతున్నారు. మంకిఫుడ్ కోర్టు ధ్వంసం చేసిన వ్యక్తులపై ప్రజల అస్తుల ధ్వంసం కింద కేసు సైతం నమోదు చేశారు. మరి కేసు పురోగతి ఎమిటీ ?, ప్రభుత్వ సోమ్ము రికవరీ చేస్తారా?, భూమిని చదును చేసిన ట్రాక్టర్లు సీజ్‌చేశారా? అనే విషయాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార దాహంతో గ్రామ ప్రజాప్రతినిధి కుమారుడు ఇలాంటి పనులు చేస్తే మరి సామాన్యల పరిస్థితి ఎమిటి అంటు చర్చిం చుకు ంటున్నారు.

ఇదే విషయంపై స్థానిక ఎస్సై రాజును వివరణ కోరాగా తమకు అందిన ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేశామని తదుపరి చర్యలు కోర్టుకు అందించామని తెలిపారు. అలాగే ఎంపిడిఓ వెలిశాల బాలకిషన్‌ను వివరణ అడుగగా తాము ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చాము. పోలీసులు విచారణలో ఇచ్చిన దానిపై చర్యలుంటాయని అన్నారు. మరి కేసును తప్పుదోవ పట్టిస్తరా లేక రికవరీ చేస్తారా అని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News