Wednesday, November 6, 2024

ఉత్తమ బోధనతో విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలి

- Advertisement -
- Advertisement -

గార్ల: ఉత్తమ బోధనతో విద్యార్థులను ప్రతిభావంతులగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం గార్లలోని బంజారా సేవా సమితి రెసిడెన్షియల్ పాఠశాలను అదనపు కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల బోధనా తరగతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.

వారి ప్రతిభా పాఠవాలను పరీక్షించి వారు చేసిన స్కిట్‌లను చూసి మెచ్చుకున్నారు. మానసికంగా ధృడంగా ఉండేందుకు చదువుతోపాటు ఆటలు ఆడాలని, విద్యార్థులు ఏమేమి ఆటలు ఆడుతున్నారో అడిగి తెలుసుకుని ఇండోర్ గేమ్స్‌కు సంబంధించిన ఆట వస్తువులను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని సిబ్బందితో చెప్పారు. బాగా చదువుకుని ప్రయోజకులు అయి మంచి ఉద్యోగం సంపాదించేందుకు కష్టపడి చదవాలన్నారు. అనంతరం భోజన శాలను తనిఖీ చేసి మెనూ ప్రకారం అందిస్తున్న టిఫిన్, లంచ్‌ను పరిశీలించారు. డార్మిటరీలను పరిశీలించి టాయిలెట్లను శుభ్రంగా ఉంచాలని, వర్షకాలం దృష్టా దోమ తెరలను పెట్టించాలని, అవసరమైన వెలుతుతు ఉండేలా చూడాలని, స్టోర్ రూమ్‌ను తనిఖీ చేసి వంట సామాను పెట్టేందుకు ర్యాకులను ఏర్పాటుచేయాలని, 130 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో ఎంత మంది సిబ్బంది ఉన్నారో, హాజరు రిజిష్టర్‌ను పరిశీలించారు. డిజిటల్ తరగతులను పరిశీలించి ఆన్‌లైన్ సెలబస్ అందుబాటులో ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

కమ్యూనిటీ హాలును, విద్యార్థులు ఆడుకునే ఆట స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సీతంపేట గ్రామపంచాయతీలోని నర్సరీని సందర్శించి నిర్వహణను పరిశీలించారు. అవసరం మేరకు మొక్కలు నాటేందుకు పూల, పండ్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను సిద్ధం చేయాలన్నారు. నర్సరీలో ఎన్ని మొక్కలు అందుబాటులో ఉన్నాయో రిజిష్టర్ తనిఖీ చేసి చూశారు. నర్సరీ నిర్వహణ పనితీరు బాగుందని అధికారులను అభినందించారు. ఈ సందర్శనలో ఎంపీడీఓ రవీందర్‌రావు, ఎంపీఓ రజినీ, ఏపీఓ సజన్, ఇన్‌ఛార్జి తహసీల్దారు వీరన్న, బంజారా సేవా సమితి పాఠశాల ప్రిన్సిపాల్ సేనా, అకాడమిక్ ఇన్‌ఛార్జి రమేశ్, ఉపాధ్యాయులు, వన సేవకుడు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News