Friday, November 1, 2024

ప్రభుత్వ విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దశాబ్ద కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి విరివిగా తీసుకు పోవాలని విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. అందులో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన తొలివిజయం ప్రస్తుతం దేశానికే రోల్ మోడల్ గా మారింది అన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.తద్వారా ప్రభుత్వం నమోదు చేసుకున్న విజయాలలలో ఉద్యుగులుగా మీరు పడిన శ్రమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రజలకు వివరించిన వాల్లమౌతామని ఆయన చెప్పారు.విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు సమిష్టి కృషితో నమోదు కాబడ్డవని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణా స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఎర్రగడ్డలోని టి ఎస్ జెన్కో ఆడిటోరియంలో జరిగిన విద్యుత్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేలానానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల మాటల్లోనే జరిగిన అభివృద్ధిని వివరించడం ద్వారా అందులో భాగస్వామ్యం అయిన మీ శ్రమ వారికి బోధపడుతుందన్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన విజయాలు నమోదు చేయడంతో నేటి తరానికి విద్యుత్ కోతలు అంటే ఏమిటో తెలియదన్నారు. రాష్ట్ర సాధన కోసం నిబద్దతో పోరాటం చేయడమే కాకుండా వచ్చిన తెలంగాణాలో విశ్వసనీయతతో అధికారం అప్పగించిన ప్రజల నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్ పరుగులు పెట్టించారని ఆయన కొనియాడారు.

మంచినీళ్ల కోసం బారెడు దూరం పోకుండా ఉండేందుకు గాను ఇంటింటికి మంచినీరు,24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా,మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పూడిక తీసివేత లతో సస్యశ్యామలంగా మారిన పంట పొలాలు ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు అద్దం పడుతున్నాయన్నారు.అన్నింటికీ మించి యావత్ భారతదేశంలోనే తలసరి విద్యుత్ వినిమయంలో నెంబర్ వన్ గా నిలిచిన తెలంగాణా రాష్ట్రంలో మొట్టమొదటి విజయం విద్యుత్ రంగానిదే నన్నారు.అంతకు ముందు అస్తవ్యస్తంగా మారిన విద్యుత్ రంగాన్ని గాడిలోకి తెచ్చి పారదర్శకత కు పెట్టింది పేరుగా విద్యుత్ సంస్థలను నిలిపిన ఘనత యాజమాన్యాలదన్నారు.ఒకరిద్దరు కోడి గుడ్డు మీద ఈకలు పీకే సబ్ స్టాండర్డ్ గాళ్ళు సి యం డి ప్రభాకర్ రావు వంటి వారి మీద అవాకులు చెవాకులు పేలినా సూర్యుడి మీద ఉమ్మేసిన చందంగా మారాయని ఆయన ఎద్దేవా చేశారు.

అనంతరం ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండి దేవుల పల్లి ప్రభాకర్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సహాయ సహకారం, మన సమిష్టి కృషితో దేశంలోనే తెలంగాణ పవర్ సెక్టార్ ఒక కేస్ స్టడీ అయ్యిందన్నారు.ఏ రంగం తీసుకున్నా ట్రాన్స్ మిషన్, జనరేషన్, డిస్టిబ్యూషన్ ఈ విధంగా అన్ని అన్ని రంగాల్లో పనితీరు అద్భుతంగా ఉందన్నారు. ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్త, ఇప్పుడు కరెంట్ పోతే దీంతో మన బాధ్యత మరింత పెరిగిందన్నారు.మన అంతర్గత సామర్థ్యం పెంచుకోవాలి .మీరు అనుకున్నదానికంటే ఎక్కువ పీ.అర్.సీ ఇచ్చామని ఉద్యోగులను ఉద్దేశించి అన్నారు.వెయిటేజెఎస్ లేకుండానే మీరు 10 నుంచి 15 శాతం పీ.అర్.సి ఊహించి ఉంటారు కానీ 18.5 శాతం పెరిగిందన్నారు. అందరం కష్టపడి ఇష్టపడి పనిచేద్దాం టీమ్ వర్క్ అంటే పరస్పర సహకారం…పరస్పర కస్ట్ ఆ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నాయన్నారు.

ముఖ్యమంత్రికి విన్నవించే సాహాసం చేయలేకపోతున్న…విద్యుత్ శాఖ మంత్రికి కూడా విన్నవించలేకపోతున్నా… సాధ్యమైనంత తొందరగా పదవీ విరమణ అవకాశం కల్పిస్తే బాగుంటుంది ఆరోగ్యం కూడా సహకరించడంలేదన్నారు.ఈ కార్యక్రమంలో ట్రాన్సో, జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు,టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ సి యం డి రఘుమా రెడ్డి,ఎన్ పి డి సి ఎల్ సి యం డి గోపాల్ రావు,జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సాయిబాబా,జె ఏ సి కన్వీనర్ రత్నాకర్ రావు, కో-చైర్మన్ శ్రీధర్, కో-కన్వీనర్ బి సి రెడ్డి,వైస్ చైర్మన్ వజీర్, జాయింట్ సెక్రటరీ గోవర్ధన్, శ్యామ్ సుందర్, వెంకన్న గౌడ్, తులసీ నాగరాణి, ఫైనాన్స్ సెక్రటరీ కరుణాకర్ రెడ్డి లతో పాటు ఆర్గనైజింగ్ రాంజీ, నెహ్రూ, కలువల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అంతకు ముందు విద్యుత్ ఉద్యోగులు విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండి ప్రభాకర్‌వులను గజమాలతో సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News