నల్లగొండ: పోడు పట్టాలు పంపిణీ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని స్థానిక శాసనసభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని సాయిరమ్య ఫంక్షన్‌హాల్‌లో నియోజకవర్గంలో 1138 మంది లబ్ధిదారులకు పోడు భూముల పట్టాలను ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కెసిఆర్ తీసుకున్న పోడు భూముల పట్టాల పంపిణీ నిర్ణయం యావత్ దేశానికి ఆదర్శం అని తెలిపారు. గిరిజనుల ఏళ్ల కల నెరవేర్చిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు.
దశాబ్దాల పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి, అడవి బిడ్డలను యాజమానులుగా చేశారు సీఎం కేసీఆర్ అన్నారు. పోడు పట్టాలతోపాటు రైతుబంధు, రైతు బీమా అమలు చేయడం జరిగిందన్నారు. మొత్తం 1,51,146 పోడు పట్టాదారులకు రైతు బంధు పథకం ద్వారా 406 కోట్లు ఏ కారణంతో అయినా రైతు మృతి చెం దితే రైతు బీమా పథకం ద్వారా రూ.5లక్షలు ఆ కుటుంబానికి ప్రభుత్వం అందిస్తుందన్నారు. పోడు పట్టాల పంపిణీతో అటవి భూముల అన్యాక్రాంతానికి చెక్‌పెట్టాలని సర్కార్ నిర్ణయించింది, తమ కమతాల చుట్టూ ఉన్న ఫారెస్టు భూముల రక్షణ సదరు పట్టాదారులకే అప్పగిస్తుందన్నారు.
ఈ రాష్ట్రంలో బంజారుల, ఆదివాసీ ఆత్మ గౌరవాన్ని సమున్నతంగా చాటిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం అన్నారు. తెలంగాణ ఏర్పడిన తొమ్మిదేళ్ల కాలంలో గిరిజనుల అస్థిత్వాన్ని గుర్తించి, వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ గిరిజనులపై ప్రేమను, చిత్తశుద్ధిని చాటిన గొప్ప నాయకులు సీఎం కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గోపిరామ్, ఎంపిపిలు వంగాల ప్రతాప్‌రెడ్డి, జడ్పిటిసి బాలు, పిఏసిఎస్ ఛైర్మన్ వల్లపురెడ్డి, ఏటిడీవో రాజ్‌కుమార్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు టివిఎన్‌రెడ్డి, రాజినేని వెంకటేశ్వర్‌రావు, రైతుబంధు అధ్యక్షులు బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, దేపావత్ నరేందర్, వడ్త బాలు, వాంకుణావత్ బిక్కు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.