Monday, December 23, 2024

మహేశ్వరంకు మెడికల్ కళాశాల మంజూరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహేశ్వరంకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇటీవలి మహేశ్వరంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన సందర్భంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరిక మేరకు మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కళాశాల మంజూరు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు.

ఆ హామీ మేరకు బుధవారం నాడు వైద్య ఆరోగ్య శాఖ జీవో జారీ చేసింది. దాంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మీర్‌పేట్ కార్పోరేషన్‌లో సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News